Keerthy Suresh: కేరళలో వాలిన కళావతి.. స్నేహితురాలి పెళ్లిలో సందడే సందడి.. వైరలవుతోన్న ఫొటోలు..

Keerthy Suresh: సర్కారు వారి పాట సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది మహానటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh). ఇందులో ఆమె పోషించిన కళావతి క్యారెక్టర్‌కు..

Keerthy Suresh: కేరళలో వాలిన కళావతి.. స్నేహితురాలి పెళ్లిలో సందడే సందడి.. వైరలవుతోన్న ఫొటోలు..
Keerthy Suresh
Follow us
Basha Shek

|

Updated on: Jun 14, 2022 | 9:01 AM

Keerthy Suresh: సర్కారు వారి పాట సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది మహానటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh). ఇందులో ఆమె పోషించిన కళావతి క్యారెక్టర్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం SVP మూవీ సక్సెస్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్న కీర్తి షూటింగులకు కాస్త బ్రేక్‌ ఇచ్చింది. తన సొంత రాష్ట్రం కేరళకు వెళ్లిపోయి తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్‌ చేస్తోంది. కాగా తన స్నేహితురాలికి పెళ్లికి హాజరైన కీర్తి.. వాటికి సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ వెడ్డింగ్‌ బాష్‌ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. ఇందులో మరో హీరోయిన్‌ కల్యాణి ప్రియదర్శన్‌ (Kalyani Priyadarshan) కూడా ఉండడం విశేషం. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా మహానటి తర్వాత వరుసగా అపజయాలు ఎదుర్కొన్న కీర్తి… సర్కారు వారి పాట సినిమాతో గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చింది. అదేవిధంగా సాని కాయిదం (తెలుగులో చిన్ని) సినిమాలో కూడా ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఆమెకు మళ్లీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్‌లో నటిస్తోంది. ఇందులో ఆమె చిరుకు చెల్లెలిగా కనిపించనుంది. దీంతో పాటు న్యాచురల్‌ స్టార్‌ నానితో కలిసి దసరా సినిమాలో సందడి చేయనుంది. ఇక మలయాళం వాషి, తమిళంలో మామాన్నన్‌ సినిమాల్లో కూడా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Viral Video: అట్లుంటది మరి మనతో దోస్తీ అంటే.. మెట్లెక్కేందుకు స్నేహితునికి సాయం.. నెటిజన్లను ఫిదా చేస్తోన్న పప్పీ వీడియో..

Ranbir Kapoor: వివాహమైన మరుసటి రోజే షూటింగ్‌కు వెళ్లాం.. మ్యారేజ్‌ లైఫ్‌పై చాక్లెట్‌ బాయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Kajal Agarwal: ముద్దుల కుమారుడి మరో ఫొటోను షేర్‌ చేసిన చందమామ.. ఈసారి ముఖం కనిపించేలా.. వైరలవుతోన్న క్యూట్‌ ఫొటో..