Ante Sundaraniki: ప్రేమలేఖలు రాస్తున్నట్లు వ్యాసాలు రాస్తున్నారు.. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఆసక్తికర వ్యాఖ్యలు..

నాని హిందూ అబ్బాయి సుందరం పాత్రలో కనిపించగా.. నజ్రీయా క్రిస్టియన్ అమ్మాయి లీల థామస్ పాత్రలో నటించింది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అరుదైన చిత్రంగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్

Ante Sundaraniki: ప్రేమలేఖలు రాస్తున్నట్లు వ్యాసాలు రాస్తున్నారు.. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఆసక్తికర వ్యాఖ్యలు..
Vivek Athreya
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 14, 2022 | 8:46 AM

న్యాచురల్ స్టార్ హీరో నాని.. మలయాళం బ్యూటీ నజ్రీయా జంటగా నటించిన సినిమా అంటే సుందరానికీ (Ante Sundaraniki).. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 10న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మేత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని నిర్మించారు. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో నాని హిందూ అబ్బాయి సుందరం పాత్రలో కనిపించగా.. నజ్రీయా క్రిస్టియన్ అమ్మాయి లీల థామస్ పాత్రలో నటించింది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అరుదైన చిత్రంగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. అంటే సుందరానికీ సగం క్రెడిట్ హీరో నాని గారికి, నిర్మాతలకు ఇస్తాను. ఇలాంటి వైవిధ్యమైన కథ వారు ఒప్పుకోకపోయింటే ఈ రోజు ఈ సినిమాని చూసే అవకాశం వుండేది కాదు. నాని గారికి నిర్మాతలు నవీన్ , రవి గారి కృతజ్ఞతలు. కొన్ని సినిమాలు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మంచి సినిమా తీశామనే భావన కలుగుతుంది. అలా ఎమోషనల్ గా ఫీలైన సినిమా అంటే సుందరానికీ. ఈ సినిమా పది, ఇరవై రోజులు కాదు ఎప్పటికీ వుంటుంది. ప్రేక్షకులు ఎప్పటికీ చూస్తూనే వుంటారు. సినిమా చూసే కొద్ది నచ్చుతూనే వుంటుంది. సుందరం పాత్ర పోషించడం అంత ఈజీ కాదు. నానిగారు కాబట్టే సుందరం పాత్రని అంతగొప్పగా చేశారు. లీల పాత్రని గొప్పగా పోషించిన నజ్రియా కి థాంక్స్. నరేష్, రోహిణి, హర్ష వర్ధన్, నదియా , వెంకటేష్ మహా ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ఇది మ్యూజికల్ మూవీ. కథతో పాటు మ్యూజిక్ వెళ్ళడం అంత సులువు కాదు. వివేక్ సాగర్ గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు. డీవోపీ నికేత్ బొమ్మి కి నాకు మధ్య గ్రేట్ అండర్ స్టాండింగ్ వుంది. ఎడిటర్ రవితేజ గిరిజాల కి థాంక్స్. ప్రొడక్షన్ డిజైనర్ లతా అద్భుతమైన సెట్ వర్క్ చేశారు. బ్యూటీఫుల్ కాస్ట్యూమ్ అందించిన పల్లవి కి థాంక్స్. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దినేష్, సచ్విన్, స్వామి, విజయ్, విద్య, కీర్తి, అనిల్, తేజ్, విక్కీ, మా కో డైరెక్టర్ రాధ గారు అందరికీ థాంక్స్. ఈ సినిమాని ప్రేక్షకులు ప్రేమలేఖలు రాస్తున్నట్లు మూడు పేజీల వ్యాసాలు రాస్తున్నారు. సినిమాని ఎంజాయ్ చేస్తేనే ఇలా రాయగలరు. ఈ సినిమాని ఇంతలా ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు” తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు