Ram Charan Upasana: టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీ.. నెట్టింట వైరలవుతున్న రామ్ చరణ్ ఉపాసన పెళ్లి ఫోటోస్..
ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు చరణ్.. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో చరణ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఉపాసన పెళ్లి రోజు నేడు.. 2012న జూన్ 14న వీరిద్ధరు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.. నేడు వీరు టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. ప్రస్తుతం చరణ్, ఉపాసన వివాహవ వార్షికోత్సవ వేడుకలో భాగంగా ఇప్పటికే ఇటలీలో సెలబ్రెషన్స్ జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తన భార్యతో కలిసి తీసుకున్న ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేసుకున్నారు చరణ్.. అందులో చరణ్.. ఉపాసన ఇరువురు వైట్ అండ్ వైట్ దుస్తులు ధరించి ఒకరినొకరు చూస్తూ సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నారు.. నేడు రామ్ చరణ్ పెళ్లి రోజు సందర్భంగా సోషల్ మీడియాలో వీరి పెళ్లి నాటి ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు చరణ్.. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో చరణ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి మెప్పించాడు చరణ్.. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.
View this post on Instagram
Mega Power Star @AlwaysRam Charan fans Planning massive celebrations across both Telugu States on the occasion of #Ram Charan & @upasanakonidela ‘s 10 th wedding anniversary on 14th June @RcYuvaShakthi #RamCharanUpasanaWeddingAnniversa
ry #RamCharanUpasana pic.twitter.com/LMoxwEGure
— RC15 Chitti (@chittiaruncj) June 13, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.