AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virata Parvam: వెన్నెల పాత్రకు ఆమె జీవితమే ప్రేరణ.. సరళ కుటుంబాన్ని కలిసిన విరాటపర్వం చిత్రయూనిట్..

సహజ నటి సాయి పల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Virata Parvam: వెన్నెల పాత్రకు ఆమె జీవితమే ప్రేరణ.. సరళ కుటుంబాన్ని కలిసిన విరాటపర్వం చిత్రయూనిట్..
Sai Pallvi
Rajitha Chanti
|

Updated on: Jun 14, 2022 | 7:37 AM

Share

డైరక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం విరాటపర్వం (Virata Parvam) జూన్ 17న థియేటర్లలో విడుదల కానుంది. సహజ నటి సాయి పల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రియమణి, హీరో నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీలో నక్సలైట్ రవన్న పాత్రలో రానా నటించగా.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటించింది.

అయితే.. 1992లో జరిగిన ఓ మరణం తనను తీవ్రంగా కదిలించింది.. ఓ సంక్షోభం తనను ఆలోచింపజేసిందని.. ఆ మరణం వెనక రాజకీయం ఉందని.. ఆ సంఘటనను ఎలాగైనా తెరపైకీ తీసుకురావాలనే బలమైన కాంక్ష ఎప్పటి నుంచో తకు ఉండేదని.. విరాటపర్వం సినిమాలో వెన్నెల పాత్రకు స్పూర్తి వరంగల్ కు చెందిన సరళ అనే మహిళ అంటూ ఇటీవల డైరెక్టర్ వేణు ఉడుగుల చెప్పిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

తాజాగా సరళ కుటుంబాన్ని విరాటపర్వం చిత్రయూనిట్ కలిసింది. సాయి పల్లవి, రానా దగ్గుబాటి, డైరెక్టర్ వేణు ఉడుగులతోపాటు విరాటపర్వం చిత్రయూనిట్ సభ్యులు సరళ కుటుంబసభ్యులను కలుసుకున్నారు. వారితో అప్యాయంగా మాట్లాడి.. అనంతరం ఫోటోలు తీసుకున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఈ సినిమాలో వెన్నెలది మాములు పాత్ర కాదని.. ఆమెది మాములు ప్రేమ కాదని.. శివుణ్ణి ప్రేమించిన ఒక సిద్దేశ్వరి, మల్లికార్జున స్వామిని ప్రేమించిన ఒక భ్రమరాంబ, అక్క మాహదేవి, కవయిత్రి మొల్ల ఇలాంటి ఇతిహాస గుణం వున్న పాత్ర వెన్నెల అని.. అందమైన ప్రేమకథను విరాటపర్వం సినిమాలో చూపించబోతున్నట్లుగా ఇటీవల డైరెక్టర్ వేణు ఉడుగుల తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..