Kiran Abbavaram: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. విడుదలకు సిద్ధమైన కిరణ్ అబ్బవరం సినిమా..
ఎస్ఆర్ కళ్యాణమండపం, సెబాస్టియన్ సినిమాలతో అలరించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. ఈ సినిమాకు
రాజా వారు రాణి గారు సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. మొదటి సినిమాతోనే బెస్ట్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం, సెబాస్టియన్ సినిమాలతో అలరించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ కుమార్తె దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆమె సొంత నిర్మాణ సంస్థ ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. . S R కళ్యాణమండపం లాంటి సూపర్ హిట్ చిత్రం తరువాత దర్శకుడు శ్రీధర్ గాదే, కిరణ్ అబ్బవరం కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం లో కిరణ్ అబ్బవరం చాలా కొత్తగా కమర్షియల్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని లహరి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.. మరికొన్ని రోజుల్లో చిత్ర షూటింగ్ పూర్తి కానున్న ట్లు తెలిపారు దర్శక నిర్మాతలు. కిరణ్ అబ్బవరం మాస్ లుక్ లో అందర్ని ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.