అమ్మతో మాట్లాడాలి సార్.. ప్లీజ్ ఫోనివ్వరా? ఆ విద్యార్థి చివరి మాటలివే..
Mangalore: తనకోసం అన్నీ తానైన తల్లి. తన చిరునవ్వుల్లోనే సంతోషాన్ని వెతుక్కునే తల్లి. తన కోసం సర్వస్వం అర్పించే అమ్మ. అలాంటి కన్నతల్లితో ఒకే ఒక్క మాట చెప్పాలని అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలని ఆ పసిహృదయం తపించిపోయింది. కానీ హాస్టల్..
Mangalore: తనకోసం అన్నీ తానైన తల్లి. తన చిరునవ్వుల్లోనే సంతోషాన్ని వెతుక్కునే తల్లి. తన కోసం సర్వస్వం అర్పించే అమ్మ. అలాంటి కన్నతల్లితో ఒకే ఒక్క మాట చెప్పాలని అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలని ఆ పసిహృదయం తపించిపోయింది. కానీ హాస్టల్ వార్దెన్ నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించాడు. అంతే అమ్మకు బర్త్‌డే విషెస్ చెప్పాలన్న అతని ఆశ తీరలేదు. మనసంతా నిరాశతో నిండిపోయింది. ఆ బాలుడి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. కర్ణాటకలోని మంగళూరుకు సమీపంలోని ఉళ్లాలలో శారదా విద్యానికేతన్ పాఠశాల హాస్టల్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బెంగళూరు సమీపంలోని హొసకోటేకి చెందిన రమేశ్, మంజుల దంపతుల కుమారుడు పూర్వజ్ ఉళ్లాలలోని శారదా విద్యానికేతన్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం పూర్వజ్ తల్లి మంజుల పుట్టిన రోజు. తల్లితో ఒకసారి మాట్లాడతానని, మొబైల్ ఇవ్వాలని బాలుడు హాస్టల్ వార్డెన్‌ను ఎంతగానో ప్రాధేయపడ్డాడు. కానీ వార్డెన్ ససేమిరా అన్నాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన పూర్వజ్ శనివారం రాత్రి 12 గంటల వరకు ఒంటరిగా గడిపాడు. తరువాత డెత్‌నోట్ రాసి హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు.
ఆదివారం ఉదయం పూర్వజ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే హాస్టల్‌లో కలకలం చెలరేగింది. బాలుని ఆత్మహత్యకు విద్యా సంస్థ ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెనే కారణమని మంజుల సోదరుడు అరుణ్ కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థి డెత్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరూ ఆనందంగా ఉండండి. పాఠశాలలో నా కోసం చెల్లించిన ఫీజును వెనక్కి తీసుకోండి. అంతేసి ఫీజులు కట్టి.. మీరు నన్ను దుఃఖంలో పడేశారు. ఎవరూ బాధపడవద్దు’ అంటూ ఆ బాలుడు రాసిన లేఖ కన్న వారితో పాటు అందర్నీ దుఃఖసాగరంలో ముంచేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఆప్రికాట్ తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ సమస్యలున్న వారు డైట్ లో చేర్చుకోవాల్సిందే..
World Blood Donor Day 2022: రక్తదానం మహాదానమైనా.. వీరు అసలు బ్లడ్ డొనేట్ చేయకూడదు తెలుసా?