Theater- OTT Movies: ఈవారం థియేటర్లు/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే.. లిస్టులో సాయిపల్లవి, సుమక్కల చిత్రాలు..

Theater- OTT Movies: బాక్సాఫీస్‌ వద్ద సమ్మర్‌ సందడి కొనసాగుతోంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా థియేటర్లలోకి క్యూ కడుతున్నాయి. అటు ఓటీటీలోనూ కొత్త చిత్రాల హవా..

Theater- OTT Movies: ఈవారం థియేటర్లు/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే.. లిస్టులో సాయిపల్లవి, సుమక్కల చిత్రాలు..
Theater Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Jun 14, 2022 | 12:06 PM

Theater- OTT Movies: బాక్సాఫీస్‌ వద్ద సమ్మర్‌ సందడి కొనసాగుతోంది. వీలైనంత వరకు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని వసూళ్లు రాబట్టుకునేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ప్రతివారం సరికొత్త చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా థియేటర్లలోకి క్యూ కడుతున్నాయి. అటు ఓటీటీలోనూ కొత్త చిత్రాల హవా నడుస్తోంది. డిజిటల్‌ మాధ్యమం వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త కంటెంట్‌తో కూడిన చిత్రాలను రిలీజ్‌ చేస్తున్నారు. మరి ఈ వారం అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో సందడి చేసే చిత్రాలేవో చూసేద్దాం పదండి..

విరాట పర్వం దగ్గుబాటి రానా ( Daggubati Rana), సాయిపల్లవి (sai pallavi) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకుడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్లు, ట్రైలర్లు చూస్తుంటే ఇది నక్సలిజం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథని తెలుస్తోంది. ఈ సినిమాలో కామ్రేడ్‌ రవన్నగా రానా, ఆయన ప్రేయసి వెన్నెలగా సాయిపల్లవి కనిపించనున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌ఎల్‌వీ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Virata Parvam

ఇవి కూడా చదవండి

సత్యదేవ్‌  ‘గాడ్సే’ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే కాకుండా హీరోగానే వరుసగా సినిమాలు చేస్తున్నాడు సత్యదేవ్‌. తిమ్మరుసుతో ఆకట్టుకున్న ఈ హీరో నటించిన తాజా చిత్రం గాడ్సే. గతంలో ఇతనితోనే బ్లఫ్‌మాస్టర్‌ లాంటి సూపర్‌ హిట్‌ సినిమాను తెరకెక్కించిన గోపీ గణేశ్‌ ఈ సినిమాకు దర్శకుడు. సి.కల్యాణ్‌ నిర్మాత. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్‌ 17న థియేటర్లలో విడుదల కానుంది.

Satyadev Godse

ఇవి కూడా.. ఇక ఈ వారం విభిన్నమైన కథాంశంతో వస్తోన్న మరో చిత్రం కిరోసిన్‌. ధృవ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌ నిర్మించారు. జూన్‌ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవికాకుండా హీరో, మొనగాడు తదితర చిత్రాలు కూడా థియేటర్లలో సందడి చేయనున్నాయి.

3

ఓటీటీల్లో అలరించనున్న తెలుగు చిత్రాలివే..

*జయమ్మ పంచాయతీ- అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో- జూన్‌ 14

Suma Kanakala Jayamma Panchayathi Movie Pre Release Event Chief Guest As Nagarjuna And Nani

* నయనతార o2 (ఆక్సిజన్‌)- డిస్నీ+హాట్‌స్టార్‌- జూన్‌ 17

4

*రెక్కీ- జీ5- జూన్‌ 17

ఓటీటీలో రాబోయే మరికొన్ని చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు…

అమెజాన్‌ ప్రైమ్‌

* అవతార పురుషా-1 (కన్నడ)- జూన్‌ 14

* సుజల్‌ (తమిళ సిరీస్‌2)- జూన్‌ 17

నెట్‌ఫ్లిక్స్‌

* గాడ్స్‌ ఫేవరెట్‌ ఇడియట్‌ (వెబ్‌ సిరీస్‌) -జూన్‌ 15

* ది రాత్‌ ఆఫ్‌ గాడ్‌ (హాలీవుడ్‌)జూన్‌- 15

* షి (హిందీ సిరీస్‌2) -జూన్‌ 17

* ఆపరేషన్‌ రోమియో (హిందీ)- జూన్‌ 18

* సీబీఐ 5ద బ్రెయిన్‌ (మలయాళీ చిత్రం)- జూన్‌18

సోనీలివ్‌

* సాల్ట్‌ సిటీ (హిందీ సిరీస్‌)- జూన్‌ 16

జీ5

* ఇన్ఫినీట్‌ స్టోర్మ్‌ (హాలీవుడ్‌) జూన్‌- 14

* ఫింగర్‌ టిప్‌ (హిందీ, తమిళ సిరీస్‌)- జూన్‌ 17

బుక్‌ మై షో

* పారలర్‌ మదర్స్‌ (స్పానిష్‌)- జూన్‌ 17

డిస్నీ+హాట్‌స్టార్‌

* మసూమ్‌ (హిందీ)- జూన్‌ 17