Telugu News » Photo gallery » Ind vs sa indian cricket team beats south africa in Vizag.. know the reason of team india win ishan kishan harshal patel ruturaj gaikwad
IND vs SA: అదరగొట్టిన యువ భారత్.. విశాఖలో టీమిండియా విజయానికి కారణాలివే..
విశాఖ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపొంది సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకుంది.
దిగ్గజాలు దూరమై, తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడడంతో దక్షిణాఫ్రికాపై టీమిండియా బలహీనంగా ఉందని చాలామంది భావించారు. సిరీస్‌లో పుంజుకోవడం కష్టమని అనుకున్నారు. అయితే విశాఖ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపొంది సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకుంది.
1 / 6
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 179 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ భాగస్వామ్యం భారీ స్కోరుకు పునాదులు వేసింది. ఈ ఓపెనింగ్ జోడీ తొలి వికెట్‌కు కేవలం 10 ఓవర్లలోనే 97 పరుగులు జోడించింది.
2 / 6
ముఖ్యంగా మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైన రుతురాజ్ 35 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 35 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో, ఈ బ్యాట్స్‌మన్ ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
3 / 6
గత మ్యాచ్లో ఆకట్టుకున్న బౌలర్లు ఈసారి తమ జోరు చూపించారు. ముఖ్యంగా హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. పటేల్ 3.1 ఓవర్లలో 25 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీయగా.. చాహల్ నాలుగు ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు.
4 / 6
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీశారు. ఫలితంగా సఫారీలు తీవ్ర ఒత్తిడికి లోనై వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో టార్గెట్‌కు చాలా దూరంలో ఉండిపోయింది.