India Corona: దేశంలో కరోనా డేంజర్‌ బెల్స్‌.. మళ్లీ భారీగా పెరిగిన కొత్త కేసులు.. మూడు నెలల తర్వాత ఇవే అత్యధికం..

Corona Updates: దేశంలో కరోనా డేంజర్ బెల్స్‌ మోగిస్తోంది. అంతకుముందు రోజు తగ్గినట్లే తగ్గి 5వేలకు పైగా నమోదైన కొత్త కేసులు నిన్న మళ్లీ భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో ఏకంగా 8, 822 మంది వైరస్‌ బారిన పడ్డారు.

India Corona: దేశంలో కరోనా డేంజర్‌ బెల్స్‌.. మళ్లీ భారీగా పెరిగిన కొత్త కేసులు.. మూడు నెలల తర్వాత ఇవే అత్యధికం..
India Corona
Follow us

|

Updated on: Jun 15, 2022 | 10:06 AM

Corona Updates: దేశంలో కరోనా డేంజర్ బెల్స్‌ మోగిస్తోంది. అంతకుముందు రోజు తగ్గినట్లే తగ్గి 5వేలకు పైగా నమోదైన కొత్త కేసులు నిన్న మళ్లీ భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో ఏకంగా 8, 822 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం.. మంగళవారం 4,40, 278 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8, 822 మందికి కొవిడ్‌ సోకినట్లు తేలింది. అంతేకాదు నిన్న మొత్తం 15 మంది ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 5,24,792కు చేరుకుంది. కాగా దేశంలో యాక్టివ్‌ కేసులు పెరుగుతుండడంపై కేంద్ర మంత్రిత్వ ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్త కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో 53,637 కరోనా క్రియాశీలక కేసులున్నాయి. గత 24 గంటల వ్యవధిలో యాక్టివ్ కొవిడ్ కేసుల లోడ్‌ 3,089 కేసులకు పైగా పెరగడం గమనార్హం. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.12 శాతం ఉన్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింద.

కాగా మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఇక దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది. కాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కొవిడ్‌ రికవరీల సంఖ్య 4,26,67,088కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. ఇక కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఇప్పటివరకు 195. 5 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల్ని పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Health Tips For Eyes: కంటి చూపు మెరుగుపర్చుకోవాలంటే వీటిని డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

IND vs SA: అదరగొట్టిన యువ భారత్‌.. విశాఖలో టీమిండియా విజయానికి కారణాలివే..

టీ తాగొచ్చి బౌలర్లను తెగ ఆడుకున్నాడు.. 43 బంతుల్లో 93 రన్స్‌.. టెస్ట్‌ మ్యాచ్‌లో 147కు పైగా స్ట్రైక్‌రేట్‌తో మెరుపు ఇన్నింగ్స్‌..

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు