టీ తాగొచ్చి బౌలర్లను తెగ ఆడుకున్నాడు.. 43 బంతుల్లో 93 రన్స్.. టెస్ట్ మ్యాచ్‌లో 147కు పైగా స్ట్రైక్‌రేట్‌తో మెరుపు ఇన్నింగ్స్..
England vs New Zealand 2nd Test: టీ విరామానికి ముందు ఆచితూచి ఆడిన ఈ స్టార్ ప్లేయర్ టీ బ్రేక్ తర్వాత పెను విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్స్ లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సూపర్ సెంచరీతో (92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 136)..
England vs New Zealand 2nd Test: టీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది మన మెదడును ఉత్తేజపరుస్తుంది. మరింత యాక్టివ్‌గా పనిచేయనిస్తుంది. ఈక్రమంలో టీ పవర్‌ను మరోసారి చూడాలనకుంటే నాటింగ్‌హామ్ టెస్ట్‌లో బెయిర్ స్టో ఇన్నింగ్స్‌ని చూడవచ్చు. టీ విరామానికి ముందు ఆచితూచి ఆడిన ఈ స్టార్ ప్లేయర్ టీ బ్రేక్ తర్వాత పెను విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్స్ లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సూపర్ సెంచరీతో (92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 136) డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌ను అనూహ్యంగా గెలిపించాడు. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే 2-0 తేడాతో చేజిక్కించుకుంది ఇంగ్లండ్.
అంతా టీ తాగొచ్చాకే.. కాగా నాటింగ్‌హామ్ టెస్టులో విజయం సాధించేందుకు, ఆతిథ్య ఇంగ్లండ్ ముందు న్యూజిలాండ్ 50 ఓవర్లలో 300 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టెస్టు మ్యాచ్‌లో 5వ రోజు టార్గెట్‌ను ఛేదించడం అంత తేలిక కాదు. అది కూడా నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అయితే బెయిర్‌స్టో దూకుడు ముందు ఇవేవీ సాగలేదు. న్యూజిలాండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. 300 పరుగుల లక్ష్య ఛేదనలో 93 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టును బెయిర్ స్టో ఆదుకున్నాడు. తుపాన్ సెంచరీతో డ్రాగా ముగియాల్సిన టెస్ట్‌ను విజయంతో ముగించాడు. కాగా 5వరోజు టీ విరామానికి ముందు కేవలం 43 పరుగులు చేసిన జానీ.. టీ బ్రేక్ తర్వాత కివీస్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. టీ తాగి 43 బంతుల్లో 93 పరుగులు చేశాడు. అతను ఇన్నింగ్స్ లో ఉన్న మొత్తం 7 సిక్సర్లలో 6 టీ బ్రేక్ తర్వాత కొట్టినవే.
కాగా నాటింగ్‌హామ్‌లో సాధించిన శతకం జానీ బెయిర్‌స్టో టెస్ట్ కెరీర్‌లో 9వ సెంచరీ. అదే సమయంలో, ఈ క్యాలెండర్ ఇయర్‌లో అతనికి ఇది మూడో సెంచరీ. ఒక క్యాలెండర్ ఇయర్‌లో మూడు టెస్టు సెంచరీలు చేయడం బెయిర్‌స్టో కెరీర్‌లో ఇది రెండోసారి. అంతకుముందు 2016లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
Jonny Bairstow, an innings of a lifetime, one of the best counter-attacking 4th innings you will ever see.Well done England , Test Cricket is Best Cricket. #ENGvNZ pic.twitter.com/BV5dVzbIqk
— Virender Sehwag (@virendersehwag) June 14, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: