Gold Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా అదే దారిలో..
Gold Silver Price Today: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. పసిడి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారంపై దాదాపు వెయ్యి రూపాయల మేర తగ్గడం విశేషం.
Gold Silver Price Today: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. పసిడి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారంపై దాదాపు వెయ్యి రూపాయల మేర తగ్గడం విశేషం. అటు వెండి కూడా పసిడి దారిలోనే పయనిస్తోంది. సిల్వర్ రేట్లు కూడా భారీగా దిగొచ్చాయి. మరి బుధవారం (జూన్15) రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం రండి.
☛హైదరాబాద్: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.47,400గా ఉంది. నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.960 దిగిరావడం గమనార్హం. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.51,710కి తగ్గింది. నిన్నటితో పోల్చితే రూ.1050 తగ్గింది.
☛ విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద కొనసాగుతోంది.
☛ విశాఖ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,400 పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద ఉంది.
☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,880 పలుకుతోంది.
☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,880 వద్ద కొనసాగుతోంది.
☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 పలుకుతోంది.
☛ కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద ఉంది.
☛ బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 పలుకుతోంది.
☛ కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద ఉంది.
బంగారం బాటలోనే సిల్వర్..
ఇక బుధవారం బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.66,000గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.1,300 తగ్గడం విశేషం. తులం వెండి రేటు సుమారు రూ.660కి తగ్గింది. ఇక విజయవాడ, విశాఖ, చెన్నై నగరాల్లోనూ ఇదే ధర వద్ద వెండి కొనసాగుతోంది. ముంబైలో రూ.59,800, ఢిల్లీలో రూ.59,800, కోల్‌కతాలో రూ.59,800, బెంగళూరులో రూ.66,000, కేరళలో రూ..66,000 పలుకుతున్నాయి.
గమనిక: బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజూ మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జ్యువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి బంగారం, వెండిని కొనుగోలు చేయలనుకునేవారు ఈ అంశాలన్నింటినీ పరిశీలించుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Major Movie: పాఠశాలలకు మేజర్ టీం స్పెషల్ ఆఫర్.. రేపటి తరానికి సందీప్ గురించి తెలపడమే లక్ష్యం..
Telangana: కులం, మతం పోయింది.. ఇప్పుడు గోత్రం అడ్డొచ్చింది.. ప్రేమ జంటకు పెద్దల వేదింపులు..!