Major Movie: పాఠశాలలకు మేజర్ టీం స్పెషల్ ఆఫర్.. రేపటి తరానికి సందీప్ గురించి తెలపడమే లక్ష్యం..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శశికిరణ్ తిక్క తెరకెక్కించిన మేజర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది.

Major Movie: పాఠశాలలకు మేజర్ టీం స్పెషల్ ఆఫర్.. రేపటి తరానికి సందీప్ గురించి తెలపడమే లక్ష్యం..
Major Movie
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Jun 15, 2022 | 9:12 PM

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అంటే తెలియని వారుండరు.. 26/11 ముంబై ఉగ్రదాడులలో ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మేజర్ (Major) సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలోని సంఘటనలను ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లుగా చూపించారు డైరెక్టర్ శశికిరణ్ తిక్క.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శశికిరణ్ తిక్క తెరకెక్కించిన మేజర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. జూన్ 3న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే ఆర్మీలోకి వెళ్లాలనుకునేవారికి అన్ని విధాలుగా సాయం చేస్తామని మేజర్ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పాఠశాలలో కోసం మరో స్పెషల్ అనౌన్స్ చేసింది చిత్రయూనిట్..

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో టికెట్ ధరపై 50 శాతం రాయితీ ఇస్తోంది.. పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక షో కోసం majorscreening@gmail.comకి మెయిల్ చేసి ఈ అవకాశాన్ని అందుకోవచ్చని మేజర్ టీం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో అడివి శేష్ ఓ వీడియో రిలీజ్ చేశారు.. “మేజర్ చిత్రానికి ఇంతటి భారీ విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు.. కొన్ని రోజులుగా చిన్నారులు నాకు ఫోన్ చేసి సినిమా గురించి మాట్లాడుతున్నారు.. మేము మేజర్ సందీప్ లా దేశం కోసం పోరాడతమని చెప్పడం ఆనందంగా అనిపిస్తోంది.. ఈ సినిమా పిల్లలకు ఇంత నచ్చుతుంది అనుకోలేదు.. ఈ స్పందన చూసి ఓ నిర్ణయం తీసుకున్నాం.. అందరూ పిల్లలు మేజర్ గురించి తెలుసుకోని స్పూర్తి పొందాలని గ్రూప్ టికెట్ పై పాఠాశాలలకు రాయితీ కల్పిస్తున్నాం.. రేపటి తరానికి మేజర్ సందీప్ గురించి తెలియజేయడమే మా లక్ష్యం ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..