Rashmika Mandanna: సెక్యూరిటీ గార్డుపై రష్మిక సీరియస్.. సెల్ఫీ కోసం వచ్చిన అభిమానికి సపోర్ట్‏గా శ్రీవల్లి..

కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళం, హిందీలోనూ చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. ఓవైపు సినిమా షూటింగ్స్ అంటూ తెగ బిజీగా ఉండే రష్మిక.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్

Rashmika Mandanna: సెక్యూరిటీ గార్డుపై రష్మిక సీరియస్.. సెల్ఫీ కోసం వచ్చిన అభిమానికి సపోర్ట్‏గా శ్రీవల్లి..
Rashmika
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 14, 2022 | 12:25 PM

అగ్రకథానాయికలలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్నా (Rashmika Mandanna).. ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళం, హిందీలోనూ చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. ఓవైపు సినిమా షూటింగ్స్ అంటూ తెగ బిజీగా ఉండే రష్మిక.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినిమా అప్డేట్స్ కాకుండా.. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా రష్మిక తన సెక్యూరిటీ పై సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎప్పుడూ చిరునవ్వుతో.. ఎంతో ప్రశాంతంగా కనిపించే రష్మిక తన సెక్యూరిటీ గార్డ్ పై ఎందుకు ఫైర్ అయ్యిందో తెలుసుకుందామా.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో రష్మిక షూటింగ్ సెట్ నుంచి క్యారవాన్‏లోకి వెళ్తున్న సమయంలో ఆమెతో కొందరు అభిమానులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. వారితో చిరునవ్వుతో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఒకరి తర్వాత ఒకరుగా ఫోటోస్ దిగుతున్న సమయంలో మరో అభిమాని రావడంతో అతడిని ఆపేసి.. వెనక్కు వెళ్లిపోవాలని చెప్పారు సెక్యూరిటీ.. దీంతో అతడిని విడిచిపెట్టాలంటూ సెక్యూరిటీ గార్డుపై సీరియస్ అయ్యింది రష్మిక.. అనంతరం అతడితో ఫోటో దిగి… అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రష్మిక పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సౌత్ స్టార్స్ ఎప్పుడూ డౌన్ టూ ఎర్త్.. అహంకారం లేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.