Sheldon Jackson:సెలెక్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేకేఆర్ ఆటగాడు.. వయసును సాకుగా చూపి డ్రామాలాడుతున్నారంటూ..
Sheldon Jackson: టీమిండియా సెలెక్టర్లపై కేకేఆర్ ఆటగాడు, వెటర్ ప్లేయర్ షెల్డన్ జాక్సన్ (Sheldon Jackson) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్ల ఎంపిక విషంలో భారత సెలక్లర్లు అవలంభిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు..
Sheldon Jackson: టీమిండియా సెలెక్టర్లపై కేకేఆర్ ఆటగాడు, వెటర్ ప్లేయర్ షెల్డన్ జాక్సన్ (Sheldon Jackson) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్ల ఎంపిక విషంలో భారత సెలక్లర్లు అవలంభిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లను టీమిండియాకు ఎంపిక చేయట్లేదని ఓ సెలక్షన్ అధికారి తనతో చెప్పాడన్న జాక్సన్.. వయసును సాకుగా చూపి భారత సెలెక్టర్లు డ్రామాలాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నా తనను టీమిండియాకు ఎందుకు ఎంపిక చేయట్లేదో అర్ధం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నా జాతీయ జట్టుకు ఎంపిక కాకపోవడంపై నిరాశ చెందిన షెల్డన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
అలా అని చట్టంలో ఉందా?
‘ జాతీయ జట్టుకు నన్ను ఎందుకు ఎంపిక చేయట్లేదు అనే దానిపై నాకు ఎలాంటి సమాచారం లేదు. నేను ఇంకా ఏమి చేయాలని ఓ సెలక్షన్‌కు సంబంధించిన పర్సన్‌ను అడిగాడు. అతను నేను కాస్త ఏజ్‌డ్ పర్సన్ అని పేర్కొన్నాడు. 30ఏళ్లు పైబడిన వారు ఎవరినీ ఎంపిక చేయడం లేదని నాతో చెప్పారు. కానీ నా ముందే 32, 33ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు. నాకు తెలియక అడుగుతాను.. 30, 35, లేదా 40ఏళ్లు పైబడిన తర్వాత జట్టులోకి ఎంపిక చేసుకోకూడదనే చట్టం ఏదైనా ఉందా? ప్రతి ఒక్క క్రికెటర్‌కు టీమిండియాకు ఆడాలన్నది ఓ కల. దాన్ని సాకారం చేసుకునేందుకే ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చే వరకూ నా ప్రయత్నాలను విరమించుకోను’ అని జాక్సన్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్‌లో విఫలమైనా..
కాగా 35 ఏళ్లున్న జాక్సన్, గత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ లీగ్‌లో అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన జాక్సన్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 50కి పైగా సగటుతో పరుగులు చేస్తున్నాడు. 79 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతను.. 19 సెంచరీలు, 27 అర్ధ సెంచరీల సాయంతో 5,634 రన్స్ చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
NEET PG 2023: జనవరి 23న నీట్ పీజీ 2023 ప్రవేశ పరీక్ష..? వచ్చే నెలలో అధికారిక ప్రకటన..