IND vs SA 3rd T20I: రాణించిన టీమిండియా.. 48 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై ఘన విజయం..
IND vs SA 3rd T20I: విశాఖపట్నం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.

IND vs SA 3rd T20I: విశాఖపట్నం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. డూ ఆర్ డై లాంటి మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు రాణించడంతో.. 48 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై భారత్ జయకేతనం ఎగురవేసింది. కీలక మ్యా్‌చ్‌లో భారత జట్టు సమిష్టిగా రాణించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలకు చుక్కలు చూపించారు భారత బౌలర్లు. బౌలింగ్ ధాటిని తట్టుకోలేక సౌతాఫ్రికా ప్లేయర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. 19 ఓవర్లకు ఆలౌట్ అయి 131 పరుగుల చేసింది సౌతాఫ్రికా టీమ్. దాంతో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక రితురాజ్ గైక్వాడ్ భారత్ తరపున అత్యధిక పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి 35 బంతుల్లో 57 పరుగులు వచ్చాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు డ్వేన్ ప్రిటోరియస్ ఖాతాలో చేరాయి. తన పేరిట 2 వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా బ్యాట్ కూడా సత్తా చాటింది. అతను 21 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇక సౌతాఫ్రికా టీమ్‌లో హెన్రిచ్ క్లాసెన్ అత్యధికంగా 29 పరుగులు చేశాడు. ఇతని తరువాత నలుగురు ప్లేయర్లు మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితం అయ్యారు.
ఇరు జట్ల స్కోరు వివరాలు. భారత్: 179-5 (20 Ov) దక్షిణాఫ్రికా: 131-10 (19.1 Ov)
ఇరు జట్ల ప్లేయర్లు: భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్




దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): టెంబా బావుమా(కెప్టెన్), రీజా హెండ్రిక్స్, డ్వైన్ ప్రిటోరియస్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, అన్రిచ్ నోర్ట్జే




