Tirumala: టీఎస్‌ఆర్టీసీకి టీటీడీ తీపి కబురు.. రూ.300 టికెట్లపై కీలక నిర్ణయం.. రోజూ వెయ్యి మంది శ్రీవారి దర్శనం చేసుకునేలా..
TTD News: తెలంగాణ ఆర్టీసీకి (TSRTC)కి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణ ఆర్టీసీకి రోజుకు వెయ్యి శ్రీవారి రూ.300 దర్శన టికెట్ల కోటాను కేటాయించాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
TTD News: తెలంగాణ ఆర్టీసీకి (TSRTC)కి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణ ఆర్టీసీకి రోజుకు వెయ్యి శ్రీవారి రూ.300 దర్శన టికెట్ల కోటాను కేటాయించాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ చేసిన విజ్ఞప్తి మేరకు టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా తెలంగాణ డిపోల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌తో తిరుమల దర్శన టోకెన్లను కలిపి జారీచేసే విషయమై నాగర్‌కర్నూల్ డీవీఎం రాము మంగళవారం తిరుపతి వచ్చారు. సెంట్రల్ బస్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లి.. ఏపీలో అమలవుతున్న శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపు విధానంపై సంబంధిత అధికారులతో చర్చించారు. టీటీడీ ఈడీపీ విభాగాన్ని సంప్రదించి దర్శన టికెట్ల కేటాయింపు సాఫ్ట్‌వేర్‌ను ఇవ్వాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆ విభాగం ఆర్డర్స్ కాపీని పరిశీలించి సాఫ్ట్‌వేర్ ఇవ్వడానికి అంగీకరించారు. ఈక్రమంలో త్వరలోనే తెలంగాణ ఆర్టీసీకి వెయ్యి శ్రీవారి రూ.300 దర్శన టికెట్లను టీటీడీ కేటాయించనుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్న భక్తులు.. ప్రయాణానికి రెండ్రోజుల ముందుగా ఈ దర్శన టికెట్లను టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ లేదా సంబంధిత డీలర్ల ద్వారా బుక్ చేసుకోవాలి.
కాగా ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రోజూ వెయ్యి రూ.300 శీఘ్ర దర్శనం టికెట్లు అందిస్తున్నారు. ఇందుకుగాను బస్సు ఛార్జీతో పాటు రూ.300 అదనంగా చెల్లించాలి. వీరి కోసం ప్రతి రోజు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు శీఘ్ర దర్శనం స్లాట్లు ఏర్పాటు చేసింది. ఆర్టీసీ బస్సుల్లో భక్తులు తిరుమల బస్‌స్టేషన్ చేరుకున్న అనంతరం.. శీఘ్ర దర్శనం చేసుకునేందుకు ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయం అందిస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ సేవలు ప్రారంభించనున్నారు. కాగా ప్రయాణికులు రెండు డోస్‌ల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా దర్శనానికి 72 గంటల లోపు పొందిన కొవిడ్-19 నెగిటివ్ రిపోర్ట్‌ను తప్పనిసరిగా సమర్పించాలని టీటీడీ సూచించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Chandramukhi 2: చంద్రముఖి 2 వచ్చేస్తోంది.. ఆకట్టుకుంటున్న టైటిల్ పోస్టర్.. హీరో ఎవరో తెలుసా ?