Telangana: వరుసగా రెండో రోజు 200 దాటిన కరోనా కేసులు.. హైదరాబాద్‌లో ఎన్నంటే..
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు రెండో రోజు కూడా 200 మార్క్‌ను దాటాయి.
Telangana’s Covid-19 cases: కరోనావైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు రెండో రోజు కూడా 200 మార్క్‌ను దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వాప్తంగా 21,070 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 205 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే 14 కేసులు తగ్గాయి. కాగా.. 63 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. మరణాలు నమోదు కాలేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1,401 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే 132 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 39, మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత కేసుల సంఖ్య 200 మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలో కేసుల వివరాలు..
- రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,95,008
- కోలుకున్న వారి సంఖ్య 7,89,496
- మరణాల సంఖ్య 4,111
- రాష్ట్రంలో ఇప్పటివరకు 3,52,19,844 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..