AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger: వామ్మో.. మళ్లీ పులొచ్చింది.. గేదెలపై దాడిచేసిన టైగర్.. ఆ ప్రాంతంలో భయం భయం..

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం శరభవరం పరిసరాల్లో పులి బుధవారం తిష్టవేసింది. పశువులపై దాడికి పాల్పడిన పెద్ద పులి.. అక్కడినుంచి పరారైంది.

Tiger: వామ్మో.. మళ్లీ పులొచ్చింది.. గేదెలపై దాడిచేసిన టైగర్.. ఆ ప్రాంతంలో భయం భయం..
Tiger
Shaik Madar Saheb
|

Updated on: Jun 15, 2022 | 6:26 PM

Share

Tiger fear in kakinada district: ఏపీలో కాకినాడలో కాలుమోపిన పులి కదలనంటూ సవాల్ విసురుతోంది.. ఎన్ని ఎత్తుగడలు వేసినా, చిక్కనంటూ.. అధికారుల వ్యూహాలను పటాపంచలుచేస్తోంది. అటవీశాఖ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పరుగులు పెట్టిస్తున్న పులి.. మరోసారి పశువులపై పంజా విసిరింది. తాజాగా.. మళ్ళీ వేట మొదలు పెట్టిన పులి.. గేదెలపై దాడిచేసింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం శరభవరం పరిసరాల్లో పులి బుధవారం తిష్టవేసింది. పశువులపై దాడికి పాల్పడిన పెద్ద పులి.. అక్కడినుంచి పరారైంది. గేదె, లేగ దూడ మెడపై దాడికి పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. అయితే.. పెద్దపులిని చూసిన పశువులు అక్కడి నుంచి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నాయి. ఈ క్రమంలో గేదె, దూడకు గాయాలయ్యాయి. పశువులు నరాలశెట్టి శ్రీనుకు చెందిన గేదెలుగా పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు గ్రామానికి చేరుకొని పెద్ద పులి జాడ కోసం వెతుకుతున్నారు. కాగా.. దాదాపు నెలరోజులుగా అధికారుల చేతికి చిక్కినట్టే చిక్కి, చిక్కకుండా పోతోన్న పులి కోసం అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాగా.. పులి భయంతో పరిసర ప్రాంతాల జనం నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు.

ఇదిలాఉంటే.. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎంట్రీ ఇచ్చిన పులి నెల నుంచి అధికారుల వ్యూహాలన్నింటినీ తిప్పికొడుతోంది. దాదాపు నెల రోజులు కావస్తున్నా పులిజాడ దొరక్కపోవడంతో అధికారులు సతమతమవుతున్నారు. కాకినాడ జిల్లాలోని పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవుల పాలెం సహా 11 గ్రామాల పరిసరాల్లో పులి అడుగుజాడలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎటువైపు నుంచి పులి పంజా విసురుతుందో తెలియక జనం హడలిపోతున్నారు. ఈ ప్రాంతాల్లో బోనుల్లో మాంసాన్ని ఎరగావేసినా వచ్చినట్టే వచ్చి అడుగు దూరంలోనుంచి బోన్లను తప్పించుకొని పారిపోతోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..