Viral Video: డాక్టర్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు.. ట్రీట్మెంట్ కోసం కాదండోయ్.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఇంట్లోని జంతువు అస్వస్థతకు గురైందని.. త్వరగా రావాలంటూ వెటర్నటీ డాక్టర్ సత్యం కుమార్ కు ఫోన్ వచ్చింది. దీంతో అక్కడికి వెళ్లిన తర్వాత.. అతన్ని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

Veterinary doctor forcefully married: అతనొక వెటర్నటీ డాక్టర్.. పెంపుడు జంతువుకు బాగాలేదని ఫోన్ చేయగానే.. పరుగులు పెట్టుకుంటూ వెళ్లాడు.. కానీ చివరకు షాకయ్యే సీన్ ఎదురైంది. అతన్ని కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు.. బలవంతంగా ఎత్తుకెళ్లి వారి అమ్మాయితో పెళ్లిచేశారు. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లోని బెగుసరాయ్ ప్రాంతంలో వెలుగు చూసింది. డాక్టర్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డాక్టర్ తండ్రి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో.. తమ ఇంట్లోని జంతువు అస్వస్థతకు గురైందని.. త్వరగా రావాలంటూ వెటర్నటీ డాక్టర్ సత్యం కుమార్ కు ఫోన్ వచ్చింది. దీంతో అక్కడికి వెళ్లిన తర్వాత.. అతన్ని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం వారి అమ్మాయికిచ్చి బలవంతంగా వివాహం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటినుంచి వెళ్లిన సత్యం కుమార్ మళ్లీ తిరిగి రాకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించినట్లు సుబోధ్ కుమార్ ఝా తెలిపారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ యోగేంద్ర కుమార్ తెలిపారు. కాగా.. ఇలాంటి ఘటనలు బీహార్‌లో తరుచూ జరుగుతుండటం గమనార్హం. జీవితంలో సెటిల్ అయిన అబ్బాయిలను ఇలా కిడ్నాప్ చేసి తమ పిల్లలకు ఇచ్చి పెళ్లి చేస్తుంటారని.. కొన్ని సందర్భాల్లో తలపై తుపాకులు గురిపెట్టి కూడా తాళి కట్టిస్తుంటారంటూ పలువురు పేర్కొంటున్నారు.




వైరల్ వీడియో..
बिहार की पकड़ौआ शादी!
बेगूसराय में वेटनरी डॉक्टर सत्यम झा के पिता ने अपने बेटे का अपहरण कर जबरन शादी कराने की शिकायत दर्ज कराई है, पुलिस जाँच में जुटी. pic.twitter.com/Zx1r3yq8JK
— Utkarsh Singh (@UtkarshSingh_) June 14, 2022
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేయడంతోపాటు షేర్ చేస్తున్నారు.
Bihar | A veterinarian was abducted and forcibly married in Begusarai
“He was called around 12pm to check on a sick animal, after which 3 people kidnapped him. Everyone in the house was worried after which we went to the police.” said a relative of the victim (14.06) pic.twitter.com/OYA1lQWoBi
— ANI (@ANI) June 15, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..