Ambani VS Adani: అంబానీకి అదిరిపోయే పోటీ ఇస్తున్న అదానీ.. వేగంగా ఆస్తులు పెంచుకుంటూ..
Ambani VS Adani: స్టాక్ మార్కెట్ పుంజుకోవడంతో అదానీ గ్రూప్ కంపెనీలు విలువ పరంగా అత్యధికంగా లాభపడ్డాయి. నవంబర్ నుంచి ఏప్రిల్ 2022 వరకు ఆరు నెలల కాలంలో డైవర్సిఫైడ్ గ్రూప్ వాల్యుయేషన్ 88.1 శాతం పెరిగి రూ.17.6 లక్షల కోట్లకు చేరుకుంది.
Ambani VS Adani: స్టాక్ మార్కెట్ పుంజుకోవడంతో అదానీ గ్రూప్ కంపెనీలు విలువ పరంగా అత్యధికంగా లాభపడ్డాయి. నవంబర్ నుంచి ఏప్రిల్ 2022 వరకు ఆరు నెలల కాలంలో డైవర్సిఫైడ్ గ్రూప్ వాల్యుయేషన్ 88.1 శాతం పెరిగి రూ.17.6 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో.. మరో ప్రముఖ వ్యాపార వేత్త ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ సైతం 13.4 శాతం పెరిగి రూ.18.87 లక్షల కోట్లకు చేరుకుంది. ఒక్కసారి గమనిస్తే ముకేష్ అంబానీ కంటే గౌతమ్ అదానీ కంపెనీల వాల్యుయేషన్ దాదాపు 6.5 రెట్లు వేగంగా పెరిగింది.
ఇదే సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ. 12.97 లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. అయితే ఈ కాలంలో దీని విలువ 0.9 శాతం క్షీణించింది. ఆ తర్వాత వరుసగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ నిలిచాయి. గౌతమ్ అదానీ నేతృత్వంలోని కంపెనీల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ విలువ అత్యంత వేగంగా 139 శాతం పెరిగి రూ.4.50 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఆరు నెలల క్రితం 16వ స్థానంలో ఉన్న కంపెనీ ఏకంగా ఆరో స్థానానికి చేరుకుంది.
మిగిలిన అదానీ గ్రూప్ కంపెనీల సంగతేంటి?
అదానీ విల్మర్ దాదాపు 190 శాతం వృద్ధితో రూ.66,427 కోట్లు, అదానీ పవర్ 157.8 శాతం వృద్ధితో రూ.66,185 కోట్లకు చేరుకున్నాయి. నవంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు ఆరు నెలల కాలంలో మొత్తం తొమ్మిది గ్రూప్ కంపెనీల వాల్యుయేషన్ 88.1 శాతం పెరిగి రూ.17.6 లక్షల కోట్లకు చేరుకుంది. టాప్ 500 కంపెనీల్లో వీరికి 7.6 శాతం వాటా ఉంది.
232 లక్షల కోట్ల విలువైన 500 కంపెనీల వాల్యుయేషన్
సమీక్షా కాలంలో అదానీ గ్రూప్ కంపెనీలు వాటి విలువను 88.1 శాతం పెంచుకున్నాయి. 500 కంపెనీల విలువ కేవలం రెండు శాతం మాత్రమే పెరిగింది.” హురున్ ఇండియా నివేదిక ప్రకారం.. భారత్ లోని టాప్- 500 కంపెనీల విలువ స్వల్పంగా రెండు శాతం పెరిగి రూ. 221 లక్షల కోట్ల నుంచి రూ. 232 లక్షల కోట్లకు చేరుకుంది. మార్కెట్లు ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ.. ప్రపంచంలోని ఇతర కంపెనీలతో పోల్చుకుంటే మంచి పనితీరు ప్రదర్శిస్తున్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదిని చూపుతోందని నిపుణులు అంటున్నారు.