Crime: టీవీలో అలా చూశాడు.. లైవ్‌లో ఇలా చేశాడు.. కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు..

టీవీలో వచ్చిన ఆత్మహత్య దృశ్యాన్ని చూసి బాలుడు ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Crime: టీవీలో అలా చూశాడు.. లైవ్‌లో ఇలా చేశాడు.. కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు..
Boy Suicide
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 15, 2022 | 4:59 PM

Boy Suicide: క్షణికావేశంలో చిన్నారులు తీసుకుంటున్న దారుణ నిర్ణయాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. తాజాగా.. టీవీలో ఉరి వేసుకుంటున్న దృశ్యాన్ని చూసిన 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారకమైన ఘటన గిరిజనులు అధికంగా ఉండే మధ్యప్రదేశ్‌లోని మండ్లాలో చోటు చేసింది. టీవీలో వచ్చిన ఆత్మహత్య దృశ్యాన్ని చూసి బాలుడు ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన మండల జిల్లా బీజదండి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్తీ గ్రామంలో మంగళవారం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం.. బాలుడి తల్లిదండ్రులు ఎప్పటిలాగే పనికి వెళ్లారు. ఈ క్రమంలో బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. టీవీలో ఉరి వేసుకుంటున్న దృశ్యం చూసిన బాలుడు.. అచ్చం అలానే ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే.. బాలుడు ఉరి వేసుకున్న సమయంలో.. టీవీలో కూడా ఉరి వేసుకునే సన్నివేశం వస్తుందని స్థానికులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో బాలుడి కటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!