Crime News: ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. చికిత్స కోసం వెళ్లిన యువతికి మత్తు మందు ఇచ్చి..

అజ్మీర్‌కు చెందిన ఓ 23 ఏళ్ల యువతి.. గత కొంతకాలంగా లో బీపీ సమస్యతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో తన సోదరుడితో కలిసి చికిత్స చేయించుకునేందుకు వెళ్లింది.

Crime News: ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. చికిత్స కోసం వెళ్లిన యువతికి మత్తు మందు ఇచ్చి..
Representational Image
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 15, 2022 | 3:14 PM

Rape Attempt On Patient At Govt Hospital: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన 23 ఏళ్ల యువతిపై.. కాంట్రాక్టు ఉద్యోగి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అజ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర్‌కు చెందిన ఓ 23 ఏళ్ల యువతి.. గత కొంతకాలంగా లో బీపీ సమస్యతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం.. స్థానికంగా ఉన్న జేఎల్ఎన్ ​ప్రభుత్వాసుపత్రికి తన సోదరుడితో కలిసి చికిత్స చేయించుకునేందుకు వెళ్లింది. ఈ సమయంలో అక్కడ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న నిందితుడు రాజేష్‌ను సంప్రదించారు. అమె అడ్మిట్ అయిన తర్వాత తమ్ముడు వేరే పనిమీద బయటకెళ్లాడు. ఇదే అదనుగా భావించిన కాంట్రాక్ట్​ ఉద్యోగి రాజేశ్.. ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు.

బాధితురాలి సోదరుడు మరలా వచ్చి చూసేసరికి ఆమె స్పృహతప్పి పడిపోయి ఉంది. మాట్లాడే స్థితిలో కూడా లేకపోవడంతో.. వెంటనే వేరే ఆసుపత్రికి ఆమెను తరలించాడు. అనంతరం యువతి తల్లి.. తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఆసుపత్రిలో మహిళపై రాజేష్ అత్యాచారం చేశాడని బాధితురాలి తల్లి ఆరోపించింది. ఆమెకు కొన్ని మత్తుమందులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఛవీ శర్మ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నార్త్ అమెరికాలో కలెక్షన్స్‌‏ను కుమ్మేస్తున్న వెంకటేశ్‌ సినిమా..
నార్త్ అమెరికాలో కలెక్షన్స్‌‏ను కుమ్మేస్తున్న వెంకటేశ్‌ సినిమా..
సాదాసీదాగా కనిపిస్తోన్న ఈ చిన్నది.. ఇప్పుడు అందాల అటామ్ బాంబ్..
సాదాసీదాగా కనిపిస్తోన్న ఈ చిన్నది.. ఇప్పుడు అందాల అటామ్ బాంబ్..
యానాంబీచ్‌లో సంక్రాంతి సందడి బీచ్‌ బైక్‌లనుప్రారంభించిన ఎమ్మెల్యే
యానాంబీచ్‌లో సంక్రాంతి సందడి బీచ్‌ బైక్‌లనుప్రారంభించిన ఎమ్మెల్యే
హరిహర వీరమల్లు నుంచి పవన్ పాడిన సాంగ్ ప్రోమో..
హరిహర వీరమల్లు నుంచి పవన్ పాడిన సాంగ్ ప్రోమో..
రిపబ్లిక్ డే… ఢిల్లీకి అతిథులుగా.. తెలంగాణ మహిళలకు ఆహ్వానం..
రిపబ్లిక్ డే… ఢిల్లీకి అతిథులుగా.. తెలంగాణ మహిళలకు ఆహ్వానం..
అప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడేంటి ఇలా మారిపోయింది..
అప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడేంటి ఇలా మారిపోయింది..
భారత క్రికెటర్లకు భారీ షాక్! వేతనాలపై బీసీసీఐ సంచలన నిర్ణయం!
భారత క్రికెటర్లకు భారీ షాక్! వేతనాలపై బీసీసీఐ సంచలన నిర్ణయం!
సోషల్ మీడియా లోగోలతో వెరైటీ ముగ్గు.. ఆకట్టుకుంటున్న ముగ్గు
సోషల్ మీడియా లోగోలతో వెరైటీ ముగ్గు.. ఆకట్టుకుంటున్న ముగ్గు
'గోదావరి' మూవీ సెకండ్ హీరోయిన్‎ను ఇప్పుడు చూస్తే మెంటలెక్కిపోద్ది
'గోదావరి' మూవీ సెకండ్ హీరోయిన్‎ను ఇప్పుడు చూస్తే మెంటలెక్కిపోద్ది
మహా కుంభమేళాలో ప్రముఖ నటి .. వీడియో వైరల్
మహా కుంభమేళాలో ప్రముఖ నటి .. వీడియో వైరల్