Tirupati: కార్మికుడి ప్రాణం తీసిన మ్యాన్‌హోల్.. మరో ఇద్దరి పరిస్థితి విషమం..
ఎమ్మార్ పల్లి సర్కిల్లోని వైకుంటాపురం ఆర్చి వద్ద శుభ్రం చేసేందుకు ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మ్యాన్‌హోల్‌కి దిగారు.
Tirupati Manhole Death: మ్యాన్‌హోల్ మరో కార్మికుండి ప్రాణం తీసింది. డ్రైనేజీని శుభ్రం చేసేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగిన కార్మికుడు.. విషవాయువు పీల్చి మృతిచెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో చోటుచేసుకుంది. ఎమ్మార్ పల్లి సర్కిల్లోని వైకుంటాపురం ఆర్చి వద్ద శుభ్రం చేసేందుకు ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మ్యాన్‌హోల్‌కి దిగారు. ఈ క్రమంలో దిగిన కొద్దిసేపటికే వారు విషవాయువు పీల్చి అస్వస్థతకు గురయ్యారు. మ్యాన్‌హోల్ నుంచి వారి అరుపులు విన్న మరో కార్మికుడు వారిని రక్షించే యత్నంలో అతను కూడా మ్యాన్ హోల్‌లో పడిపోయాడు.
అనంతరం స్థానికుల సాయంతో బ్రీతింగ్ అపాక్షన్ సెట్ తో రెస్యూటీం మ్యాన్ హోల్ లోకి దిగి తాడు సాయంతో ముగ్గురిని బయటకు తీశారు. అప్పటికే ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే.. అప్పటికే ఓ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పారిశుధ్య కార్మికుడి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. బాధితుల కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకొని కన్నీరుమున్నీరవుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..