TET: టెట్ ప్రైమరీ కీ విడుదల.. వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారుల సూచన

ఐదేళ్ల తర్వాత తెలంగాణలో(Telangana) నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ప్రాథమిక కీ విడుదలైంది. టెట్ ప్రైమరీ కీ ని విడుదల చేస్తూ.. వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. సమాధానాలపై అభ్యంతరాలుంటే....

TET: టెట్ ప్రైమరీ కీ విడుదల.. వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారుల సూచన
Follow us

|

Updated on: Jun 15, 2022 | 8:33 PM

ఐదేళ్ల తర్వాత తెలంగాణలో(Telangana) నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ప్రాథమిక కీ విడుదలైంది. టెట్ ప్రైమరీ కీ ని విడుదల చేస్తూ.. వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. సమాధానాలపై అభ్యంతరాలుంటే జూన్‌ 18 లోపు ఆన్‌లైన్‌లో సమర్పించాలని తెలిపారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90% మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం నిర్వహించిన పేపర్‌-1కు 3,18,506, పేపర్‌-2కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా ఈ నెల 12 న జరిగిన టెట్ పరీక్ష కోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2,683 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టెట్ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017 జులైలో టెట్ పరీక్ష నిర్వహించారు. ఐదు సంవత్సరాల తర్వాత టెట్ నోటిఫికేషన్ వెలువడటం, బి.ఈడీ అభ్యర్థులకు పేపర్ 1 రాసేందుకు అవకాశం కల్పించడంతో ఈసారి కొత్త, పాత అభ్యర్థులు టెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

అంతే కాకుండా టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు. ఈసారి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో గతంలో టెట్ ఉత్తీర్ణులైన బీ.ఈడీ, డీ.ఈడీ అభ్యర్థుల్లో అధిక శాతం తమ స్కోర్‌ను పెంచుకునేందుకు మరోసారి టెట్ రాశారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్ అభ్యర్థులు 60 శాతం, బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్‌సీ, ఎస్‌టీ, వికలాంగుల కేటగిరీకి చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులను సాధించాలి. మరోవైపు.. ఈ నెల 27న టెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి.