Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో 1,326 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
నిరుద్యోగులకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే వివిధ శాఖల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు..తాజాగా వైద్యారోగ్యశాఖలో పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో...
నిరుద్యోగులకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే వివిధ శాఖల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు..తాజాగా వైద్యారోగ్యశాఖలో పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1,326 ఉదోగ్యాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌లో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, వైద్య విద్య డైరెక్టరేట్‌లో 357 ట్యూటర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 211 సివిల్ సర్జన్ జనరల్, ఐపీఎంలో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నియామక మండలి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. కాగా.. తెలంగాణ(Telangana) గ్రూప్-1 కు దరఖాస్తులు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు పోటెత్తాయి. ఎన్నడూ లేనంతగా ఒక్కో పోస్టుకు సగటున 756 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
గ్రూప్-1 లోని 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు అయ్యాయి. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేసుకోగా.. ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీలో ఉన్నారు. అయితే మహిళా అభ్యర్థులు జనరల్ పోస్టుల్లోనూ మెరిట్ సాధిస్తే మరిన్ని పోస్టులు పొందే అవకాశం ఉంది. దివ్యాంగుల కేటగిరీలోని 24 పోస్టులకు 6,105 మంది దరఖాస్తు చేసుకోగా ఒక్కో పోస్టుకు 254 మంది చొప్పున పోటీలో ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి