చేతుల్లోనే మిత్రుడి మరణం.. సాయం కరువై.. రిక్షాలో మృతదేహంతో స్నేహితులు..

వారంతా స్నేహితులు. ఐస్​క్రీమ్​ అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఐస్​క్రీమ్ అమ్ముకుంటూ బతుకు బండి లాగుతున్నారు. ఇంతలో విధి వక్రీకరించింది. ఓ మిత్రుడు

చేతుల్లోనే మిత్రుడి మరణం.. సాయం కరువై.. రిక్షాలో మృతదేహంతో స్నేహితులు..
Friend Dead Body
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 15, 2022 | 1:33 PM

వారంతా స్నేహితులు. ఐస్​క్రీమ్​ అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఐస్​క్రీమ్ అమ్ముకుంటూ బతుకు బండి లాగుతున్నారు. ఇంతలో విధి వక్రీకరించింది. ఓ మిత్రుడు ప్రమాదానికి గురయ్యాడు. ఎలాగైనా తమ మిత్రుడిని బతికించుకోవాలని తోటి స్నేహితులు యత్నించారు. మొదట ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఇక లాభం లేదనుకుని స్నేహితుడి స్వగ్రామం తీసుకెళ్లాలని భావించారు. అంతలోనే స్నేహితుడు ప్రాణం వదిలాడు. కనీసం తమ మిత్రుడి శవాన్ని మార్చురీకి తరలించేందుకు కూడా డబ్బులు లేని దయనీయ స్థితి. ఇటువంటి పరిస్థితుల్లో సాయం చేయడానికి ఎవరూ రాలేదు. చివరకు మిత్రుడి శవాన్ని ఓ రిక్షాలో మార్చురీకి తరలించిన హృదయవిదారక ఘటన ఇది.

పొట్టకూటి కోసం వలస వచ్చిన స్నేహితులు వారు..ఐస్​క్రీమ్​అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఐస్​క్రీమ్ అమ్ముకుంటూ బతుకు బండి లాగుతున్నారు. ఇంతలో విధి వక్రీకరించింది. వారిలో ఓ మిత్రుడు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహం తరలింపు కోసం ఆ మిత్రులు పడిన వేదన వర్ణనాతీతంగా మారింది. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది.

పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి ఐస్​క్రీమ్ అమ్ముకుని బతికేందుకు వచ్చిన ఆరుగురు స్నేహితుల్లో ఒకరు ప్రమాదం బారినపడి మృత్యువాతపడిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. మిగిలిన స్నేహితుల దయనీయత అందరినీ కంటతడి పెట్టించింది. ఐస్​క్రీమ్ అమ్మి జీవనం సాగించేందుకు వచ్చిన స్నేహితుల్లో ఒకరు చనిపోవడం, మృతదేహాన్ని సొంతూరుకు తరలించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక మృతదేహాన్ని రిక్షాలో ఆస్పత్రి మార్చురీకి తరలించారు తోటి స్నేహితులు.

ఇవి కూడా చదవండి

వాళ్లంతా ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వాళ్లు. మృతుడు ఐస్​క్రీం అమ్ముతూ జీవనం సాగించేవాడు. సూర్యాపేట జిల్లాలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్ల తీవ్రంగా గాయపడ్డాడు. తొలుత నకిరేకల్, సూర్యాపేటలో చికిత్స చేయించాం. తర్వాత హైదరాబాద్​కు తీసుకెల్లేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ డబ్బులు లేక సొంత ఊరికి తీసుకెళ్లాలనుకున్నాం. ఖమ్మం రైల్వేస్టేషన్​ మా స్నేహితుడు మరణించాడు. శవాన్ని తరలించాలని ఆటో, అంబులెన్స్​ను అడిగితే రూ. 5వేలు అడిగారు. అంత డబ్బు లేక రూ. 500 ఇచ్చి రిక్షాలో మార్చురీకి తరలించామని తోటి స్నేహితుడు గౌరవ్ కుమార్ తెలిపాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి