AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cat and Rat Friendship: వైరలైన పిల్లి- ఎలుక వింత స్నేహం.. వీడియో చూస్తే అవాక్కే

సాధరణంగా మనిషికి ఉన్న అన్ని బంధాల్లోకెల్లా స్నేహబంధం ఎంతో గొప్పది. వెల కట్టలేనిది. అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, అత్త, పిన్ని, బాబాయ్, మామయ్య ఇలా చాలా బంధాలు మనకు మనం ఎంచుకున్నవి కాదు..

Cat and Rat Friendship: వైరలైన పిల్లి- ఎలుక వింత స్నేహం.. వీడియో చూస్తే అవాక్కే
Friendship
Jyothi Gadda
|

Updated on: Jun 15, 2022 | 1:15 PM

Share

Friendship: సాధరణంగా మనిషికి ఉన్న అన్ని బంధాల్లోకెల్లా స్నేహబంధం ఎంతో గొప్పది. వెల కట్టలేనిది. అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, అత్త, పిన్ని, బాబాయ్, మామయ్య ఇలా చాలా బంధాలు మనకు మనం ఎంచుకున్నవి కాదు.. కానీ స్నేహ బంధం అలా కాదు. మన స్నేహితులుగా ఎవరినైనా ఎంచుకునే అవకాశం మనకే ఉంది. ఆ స్నేహం నిజమైంది అయితే అన్ని బంధాలకన్నా కలకాలం కలిసి మనకు అండగా నిలబడుతుంది. ఈ స్నేహం అనేది కేవలం మనుషుల్లోనే కాదు..కొన్ని జంతువులు సైతం ఇతర జంతువులతో కూడా స్నేహం చేస్తుంటాయి. అలాంటి స్నేహాలకు సంబంధించి అనేక వీడియోలు మనకు నెట్టింట్లో తరసపడుతుంటాయి. ముఖ్యంగా జాతి వైరం ఉన్న జంతువులు ఫ్రెండ్ షిప్ చేయడం చాలా అరుదు. కుక్క- పిల్లి, ఎలుక-పిల్లి, కుక్క- కోతి, ఇవి నిత్య శత్రువులు.. ఒక జీవికి మరో జీవి ఎదురు పడింది అంటే కొట్లాడుకోవడమే కాని ఫ్రెండ్ షిప్ చేయడం చాలా కష్టం. కానీ, ఇక్కడ రెండు పరస్పర శత్రుత్వ కలిగిన జీవులు స్నేహం చేస్తున్నాయి. వాటి మిత్రత్వం సోషల్‌ మీడియాలో చేరింది.

ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో పిల్లి ఎలుక మధ్య ఉన్న స్నేహం అందరినీ కట్టిపడేస్తోంది. ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.. ఎంతో ప్రేమగా ఎలుకను నిలువునా తడుముతోంది. ఆ రెండు చక్కిలి గింతలు పెట్టుకున్నట్టుగా సరదగా ఆడుకుంటున్నాయి. చుట్టూ పచ్చని పచ్చిక బైళ్లమీద ఈ రెండు ఆడుకుంటున్న వైనం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులు పిల్లి ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోతున్నారు. వీడియోలో పిల్లి ఓ ఎలుకను కౌగిలించుకుని గారాబం చేస్తోంది. చిన్నపిల్లలా దగ్గరకు తీసుకుని శుభ్రం చేయడాన్ని చూడవచ్చు.