Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CCTV footage: పనిమనిషి రూపంలో రాక్షసి.. తల్లిదండ్రులు లేని సమయంలో చిన్నారికి నరకం చూపించింది..

ప్రస్తుత కాలం చాలా ఖరీదైనది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేగానీ, ఇల్లు గడవని పరిస్థితి. ఈ క్రమంలోనే పిల్లల్ని పని మనుషుల వద్ద వదిలిపెట్టి వెళ్లే తల్లిదండ్రులకు ఇదో షాకింగ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. ఎందుకంటే,

CCTV footage: పనిమనిషి రూపంలో రాక్షసి.. తల్లిదండ్రులు లేని సమయంలో చిన్నారికి  నరకం చూపించింది..
Cctv Footage
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 15, 2022 | 12:46 PM

ప్రస్తుత కాలం చాలా ఖరీదైనది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేగానీ, ఇల్లు గడవని పరిస్థితి. ఈ క్రమంలోనే పిల్లల్ని పని మనుషుల వద్ద వదిలిపెట్టి వెళ్లే తల్లిదండ్రులకు ఇదో షాకింగ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. ఎందుకంటే, తల్లిదండ్రులిద్దరూ ఇల్లు వదలగానే ఓ ఇంట్లోని పనిమనిషి వికృతంగా మారిపోతుంది. తనలోని రాక్షసత్వం బయటపెడుతోంది. ఇంతకీ అసలు సంగతి ఎంటంటే…

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ ఇంటి పనిమనిషి చేసిన దారుణం ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఆ వీడియో చూసిన తల్లిదండ్రులు షాక్‌ అయ్యారు. ఆ ఇంట్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులే. ప్రతి రోజూ ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లాల్సిందే. దీంతో వారి రెండేళ్ల చిన్నారిని చూసుకునేందుకు రోజూ భోజనం పెట్టి, నెలకు రూ. 5 వేల వేతనంతో ఓ పనిమనిషిని మాట్లాడుకున్నారు. తమ చిన్నారిని ఆమె వద్ద వదిలి నిశ్చింతగా డ్యూటీలకు వెళ్లి వచ్చేవారు. అయితే, చిన్నారిలో క్రమంగా మార్పు రావడంతో పాటు రోజురోజుకు మరింత నీరసంగా తయారవుతుండడంతో అనుమానించిన దంపతులు కుమారుడిని వైద్యుడికి చూపించారు. దీంతో అన్ని టెస్టులు చేసిన వైద్యుడు షాకింగ్‌ విషయం చెప్పాడు. టెస్టు రిపోర్ట్స్ లో బాలుడి అంతర్గత అవయవాలు వాచిపోవడాన్ని గుర్తించి విషయం చెప్పడంతో తల్లిదండ్రులిద్దరూ నిఘ్రంతాపోయారు. చిత్రహింసలు పెట్టడమే అందుకు కారణమై ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

దీంతో ఇంట్లో ఏదో జరుగుతోందని అనుమానించిన బాలుడి తల్లిదండ్రులు వైద్యుడి సలహా మేరకు ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అమర్చారు. ఒక రోజు ఆ సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను చూసి వారు విస్తుపోయారు. అప్పటి వరకు అణకువగా ఉంటున్న పనిమనిషి రజినీ చౌదరి వారు ఆఫీసులకు వెళ్లిపోయిన తర్వాత వికృతంగా మారిపోయి చిన్నారిని ఇష్టం వచ్చినట్టు చితకబాదడాన్ని చూసి బాలుడి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. బాలుడి జుట్టు పట్టుకుని ఈడ్చి పడేయడం, మంచంపై పడేసి పొట్టలో ఇష్టం వచ్చినట్టు పిడిగుద్దులు కురిపించడం చూసి షాకయ్యారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నమోదు చేసుకున్న పోలీసులు పనిమనిషి రజినీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనిమనుషులుంటారు జాగ్రత్త అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.