Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video viral: మాతో పెట్టుకుంటే మడతైపోద్ది.. ఆరుగురు అబ్బాయిల్ని చితక్కొట్టిన ఆడపులి.. వీడియో వైరల్..

అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కొంతమంది అబ్బాయిలు అన్ని వైపుల నుండి అమ్మాయిని చుట్టుముట్టి వేధించడం ప్రారంభిస్తారు, అయితే ఆ సమయంలో అమ్మాయి అందరికీ తగిన గుణపాఠం చెబుతుంది..

Video viral: మాతో పెట్టుకుంటే మడతైపోద్ది.. ఆరుగురు అబ్బాయిల్ని చితక్కొట్టిన ఆడపులి.. వీడియో వైరల్..
Girl Single
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 15, 2022 | 11:34 AM

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షలాది మంది మహిళలు లైంగిక వేధింపులకు గురవుతుండడం చాలా దురదృష్టకరం. నేరస్థుల నుండి తమను తాము రక్షించుకోవడానికి మహిళలు తరచుగా ప్రాక్టీస్ చేయమని, ఆత్మరక్షణ కోసం శిక్షణా తరగతులు తీసుకోవాలని తరచూ చెబుతుంటారు. అయితే, ఈ కాలం అమ్మాయిలు చాలా తెలివైనవారు, ధైర్య వంతులు కూడాను. ఆపద సమయాల్లో తప్పించుకుని ఎలా బయటపడాలో వారికి చాలా వరకు తెలుసుననే చెప్పాలి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇందులో కొంతమంది అబ్బాయిలు అన్ని వైపుల నుండి అమ్మాయిని చుట్టుముట్టి వేధింపులకు పాల్పడ్డారు.అయితే ఈ సమయంలో అమ్మాయి అందరికీ తగిన గుణపాఠం నేర్పింది.

యువతి ధైర్య సాహసాలకు సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది, అందులో ఒక ధైర్యవంతురాలైన అమ్మాయి తనను వేధించిన, బెదిరించిన 6 మంది పోకిరీలను చితక్కొట్టింది. వీడియోలో, నిర్జన రహదారిపై 6 మంది వ్యక్తులు ఒక అమ్మాయిని చుట్టుముట్టి వేధించడం కనిపించింది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదుగానీ, వీడియో మాత్రం నెటిజన్లను షాక్‌ అయ్యేలా చేస్తోంది. అమ్మాయి ఆకతాయి అబ్బాయిలతో వీరోచితంగా పోరాడుతుంది. ఫ్లయింగ్ కిక్‌లతో పాటు కొన్ని మార్షల్ ఆర్ట్స్ కదలికలతో వారిని నేలమీద పడేసి కొట్టింది. ఆమె ఆరుగురు అబ్బాయిలందరినీ ఒక్కొక్కరుగా కాళ్లతో తన్నుతూ అందరినీ పడగొడుతుంది. ఈ 25 సెకన్ల వీడియోను ఈ ‘ది ఫిగెన్’ క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

అతను ఈ వీడియోకి ఇచ్చిన  క్యాప్షన్‌లో ఇలా రాసుకొచ్చారు.. ‘అమ్మాయిలతో గొడవ పెట్టుకొవద్దయ్యా! అన్నారు.  వైరల్ వీడియో ఇప్పటివరకు 35 లక్షల వీక్షణలను సంపాదించింది.  9000 కంటే ఎక్కువ మంది నెటిజన్లు షేర్  చేశారు. ఇది సీసీటీవీ ఫుటేజీ అని వీడియోను బట్టి అర్థం చేసుకోవచ్చు. నెటిజన్లు ఆమె ధైర్యసాహసాలు, శక్తిని చూసి  నెటిజన్లు ముగ్ధులయ్యారు.  అయితే మహిళలు ప్రతిరోజూ చాలా కష్టాలను అనుభవిస్తున్నారని చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘ఏ అమ్మాయి ఇలాంటి కష్టాలు పడకూడదు. ఇది ఎప్పటికీ సరైనది కాదు. మీ అబ్బాయిలకు మంచి నడవడిని నేర్పండి అంటూ మరొకరు, నెటిజన్ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి