Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Vijayasai Reddy: కర్మ ఫలం అంటే ఇదే.. రాహుల్‌ గాంధీపై విజయసాయిరెడ్డి సెటైర్లు..

ట్విట్టర్ వేదికగా రాహుల్ ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, పాపం చేస్తే పాపం, పుణ్యం చేస్తే పుణ్యమే వస్తుందని రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలకు ఫలితం రాహుల్ గాంధీ..

MP Vijayasai Reddy: కర్మ ఫలం అంటే ఇదే.. రాహుల్‌ గాంధీపై విజయసాయిరెడ్డి సెటైర్లు..
Vijayasai Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 15, 2022 | 12:49 PM

ట్విట్టర్ వేదికగా మరోసారి సెటైర్లు సంధించారు ఏపీ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి(Vijayasai Reddy). కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్‌ గాంధీ ఈడీ విచారణ చేయడంపై రాజకీయం చేయడం తగదన్నారు. ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, పాపం చేస్తే పాపం, పుణ్యం చేస్తే పుణ్యమే వస్తుందని రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలకు ఫలితం రాహుల్ గాంధీ అనుభవిస్తున్నారని అన్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా నేషనల్‌ హెరాల్డ్‌ కేసు తెర మీదికి తెచ్చిందని గుర్తు చేశారు. దీన్నికేంద్ర ప్రభుత్వానికి ఆపాదించి కక్ష సాధింపుగా ఆరోపించడం సరికాదన్నారు. ఇదిలావుంటే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో వరుసగా మూడో రోజు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీని ఈడీ విచారిస్తోంది. మంగళవారం రాహుల్‌ను 12 గంటల పాటు విచారించింది ఈడీ. మంగళవారమే విచారణ ముగించాలని ఈడీ అధికారులను రాహుల్‌గాంధీ కోరినట్టు తెలుస్తోంది. అయితే బుధవారం మళ్లీ రావాలని కోరడంతో ఇవాళ హాజరయ్యారు. రాహుల్‌ ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అటు ఏఐసీసీ కార్యాలయం దగ్గర , ఇటు ఈడీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్‌ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు పోలీసులు.

గతంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం ఇళ్లపై సిబిఐ అధికారులు సోదాలు చేసిన సమయంలో కూడా విజయసాయిరెడ్డి ఇదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు సంధించారు. చిదంబరాన్ని ఓ ఆర్థిక ఉగ్రవాదిగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. ఆయనను తక్షణం అరెస్టు చేయాలంటూ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాదు చిదంబరాన్ని తక్షణమే అరెస్టు చేసి, 2004-14 మధ్య కాలంలో ఆయన క్యాబినెట్ మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, చర్యలపై న్యాయ విచారణ జరపాలన్నారు. చిదంబరం మంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యర్థులపై కనికరం లేకుండా కేసులు బనాయించాడని మండిపడ్డారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైందని.. కర్మ తిరిగి రివర్స్ కొడుతోందంటూ విజయసాయి రెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే.  ఏ విత్తు పాతితే ఆ పంటే వస్తుంది అంటూ సెటైర్లు వేశారు.

కేసులు తెరపైకి వస్తున్నందున, కోట్లాది డబ్బును అక్రమంగా కూడబెట్టేందుకు చిదంబరం దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని స్పష్టమవుతోందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. వైట్ కాలర్ నేరాలు, మోసం, పట్టపగలు దోపిడీలు చేసి, ఆపై ఆర్థిక మరియు రాజకీయ సమస్యల గురించి మాట్లాడే ధైర్యాన్ని అతను ఎలా పొందాడో అర్థం చేసుకోలేకపోయాను అని పేర్కొన్న విజయసాయిరెడ్డి, చిదంబరం రాష్ట్రానికి శత్రువు. అతని చట్టవిరుద్ధమైన , నేరపూరిత చర్యలు ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించాయి అని వ్యాఖ్యానించారు.

ఏపీ వార్తల కోసం