Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips For Eyes: కంటి చూపు మెరుగుపర్చుకోవాలంటే వీటిని డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

Health Tips For Eyes: ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో ఎక్కువసేపు పనిచేయడం వల్ల కళ్లపై చాలా ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇది కాకుండా ఈరోజుల్లో పెద్దలే కాదు పిల్లలు కూడా ఎక్కువగా స్మార్ట్‌ ఫోన్స్‌ వాడుతున్నారు.

Health Tips For Eyes: కంటి చూపు మెరుగుపర్చుకోవాలంటే వీటిని డైట్‌లో చేర్చుకోవాల్సిందే..
Follow us
Basha Shek

|

Updated on: Jun 15, 2022 | 9:26 AM

Health Tips For Eyes: ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో ఎక్కువసేపు పనిచేయడం వల్ల కళ్లపై చాలా ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇది కాకుండా ఈరోజుల్లో పెద్దలే కాదు పిల్లలు కూడా ఎక్కువగా స్మార్ట్‌ ఫోన్స్‌ వాడుతున్నారు. వీటివల్ల పిల్లల కళ్లపై కూడా చాలా చెడు ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్ల వాడకం బాగా పెరిగింది. స్క్రీన్‌ని ఎక్కువసేపు చూడటం వల్ల కళ్లలో మంట, నీరు కారడం, చూపు మందగించడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి, అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరచడానికి ( Health Tips For Eyes ) కొన్ని ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.

క్యారెట్లు..

బీటా కెరోటిన్, విటమిన్ ఎ కళ్లకు చాలా మేలు చేస్తాయి. క్యారెట్‌లో ఈ రెండూ ఉంటాయి. క్యారెట్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి చూపును మెరుగుపర్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆకు కూరలు..

ఆకు కూరలు ఎక్కువగా తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. వీటిలోని లుటిన్, జియాక్సంతిన్ అనే పోషకాలు కళ్లకు చాలా మేలు చేస్తాయి. కంటి చూపును పెంచడంలో సహాయపడతాయి. కాలే, బచ్చలికూర, బ్రోకలీ మొదలైనవి డైట్‌లో చేర్చుకోవచ్చు. వీటిలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

నారింజ పండ్లు..

మిరియాలు, నారింజ, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ, కివీస్ వంటి నారింజ పండ్లు, కూరగాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కంటిశుక్లం లేదా ఇతర కంటి సంబంధిత సమస్యలను నివారించడంలో ఇది బాగా సహాయపడుతుంది.

సాల్మన్ చేపలు..

సాల్మన్ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లకు చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా కంటి చూపును పెంచడంలో సహాయపడుతాయి.

చియా, అవిసె గింజలు..

చియా, అవిసె గింజలు కళ్లకు చాలా మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా-3 యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి విటమిన్లకు మంచి మూలం కూడా..

డ్రై ఫ్రూట్స్‌..

డ్రై ఫ్రూట్స్‌ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికే కాదు కళ్లకు కూడా చాలా మేలు చేస్తాయి. ఇందుకు గాను జీడిపప్పు, వాల్‌నట్‌లు, బాదంపప్పులను డైటలో చేర్చుకోవచ్చు. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్ ఇ కళ్లకు ఎంతో మేలు చేస్తాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Also Read:

IND vs SA: అదరగొట్టిన యువ భారత్‌.. విశాఖలో టీమిండియా విజయానికి కారణాలివే..

Home Remedies: సీజనల్‌ మార్పులతో జలుబు, దగ్గు వేధిస్తున్నాయా? అయితే ఈ సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందండి..

Tirumala: టీఎస్‌ఆర్టీసీకి టీటీడీ తీపి కబురు.. రూ.300 టికెట్లపై కీలక నిర్ణయం.. రోజూ వెయ్యి మంది శ్రీవారి దర్శనం చేసుకునేలా..