AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes control: మధుమేహం బాధితులకు వరం.. దొండాకులతో షుగర్‌ లెవల్స్‌ అదుపులో..

Kundru Leaves: దొండ ఆకులు మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. దొండతో పాటు దాని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న దొండ ఆకులు షుగర్ ని..

Diabetes control: మధుమేహం బాధితులకు వరం.. దొండాకులతో షుగర్‌ లెవల్స్‌ అదుపులో..
Coccinia grandis Leaves
Sanjay Kasula
|

Updated on: Jun 15, 2022 | 9:49 AM

Share

డయాబెటిస్ అనేది జీవక్రియకు సంబంధించిన వ్యాధి. ఈ సమస్య వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. నాసిరకం జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ వ్యాధి చిన్నవయసులోనే ప్రజలను పట్టి పీడిస్తోంది. శరీరానికి ఇన్సులిన్ ఉత్పత్తి చాలా ముఖ్యం. ఇన్సులిన్ రక్తం నుంచి కణాలకు గ్లూకోజ్‌ను రవాణా చేస్తుంది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. శరీరంలో సరైన మొత్తంలో ఇన్సులిన్ తయారు కానప్పుడు.. అది బాధితుడి శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఇన్సులిన్ తయారీని ఆపివేసినప్పుడు.. రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెరను నియంత్రించడం చాలా ముఖ్యం. తరచుగా  షుగర్‌ని నియంత్రించడానికి మందులు తీసుకుంటారు. అయితే కొన్ని ప్రభావవంతమైన మూలికలను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. దొండ ఆకులు మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. దొండతో పాటు దాని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న దొండ ఆకులు షుగర్ ని ఎలా నియంత్రిస్తాయో తెలుసుకుందాం.

దొండాకు ప్రయోజనాలు

మధుమేహం, ఉబ్బసం, మలబద్ధకంతోపాటు అధిక కొలెస్ట్రాల్ వంటి అనేక వ్యాధులకు దొండాకులు నివారణగా ఉపయోగించవచ్చు. 2003 సంవత్సరంలో నిర్వహించిన ఒక పరిశోధనలో మధుమేహం చికిత్సలో కుండ్రు ఒక సహాయక, ప్రభావవంతమైన కూరగాయ అని చెప్పవచ్చు.

దొండాకులు మధుమేహాన్ని ఎలా నియంత్రిస్తాయి

దొండ అనేది అనేక వ్యాధుల చికిత్సలో వినియోగించబడే ఒక కూరగాయ. దొండతో పాటు దాని ఆకుల వినియోగం కూడా శరీరానికి అర్థవంతంగా  ఉంటుందని రుజువు చేస్తుంది. పోషకాలు అధికంగా ఉండే దొండ ఆకుల్లో విటమిన్లు, మినరల్స్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ వంటి లక్షణాలు ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ నియంత్రణకు దొండాకులను తీసుకోవాలి.

మధుమేహాన్ని నియంత్రించడానికి దొండాకులను ఎలా ఉపయోగించాలి 

మధుమేహాన్ని నియంత్రించడానికి, కుండ్రు ఆకులను బాగా కడిగి ఆరబెట్టండి. ఆకులు బాగా ఆరిపోయాక మిక్సీలో మెత్తగా పొడి చేయాలి. ఇప్పుడు ఈ పొడిని రోజూ 1 గ్రాము తీసుకోండి. మీరు దొండాకులను నీటితో లేదా పాలలో కలుపుకుని తినవచ్చు.దొండాకులు రక్తంలో చక్కెరను వేగంగా నియంత్రిస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ న్యూస్ కోసం