Star Anise Benefits: జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు అనాస పువ్వు అద్భుతమైన ఔషధం..

Star Anise Health Benefits: పులావ్‌లు, బిర్యానీలు.. నాన్ వెజ్ వంటి ఆహారపదార్ధాలను తయారు చేసే సమయంలో మసాలా పదార్ధాలను ఉపయోగిస్తుంటారు. వాటిల్లో అనాస పువ్వు ఒకటి. దీనిని స్టార్‌ అనిస్‌ అని కూడా అంటారు.

Star Anise Benefits: జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు అనాస పువ్వు అద్భుతమైన ఔషధం..
Benefits Of Star Anise
Follow us
Surya Kala

|

Updated on: Jun 15, 2022 | 1:28 PM

Star Anise Health Benefits: భారతీయుల వంట ఇల్లే ఓ మెడికల్ షాప్.. పోపుల పెట్టే ఓ ఔషధాల గని. ముఖ్యంగా సీజనల్ వ్యాధులైన జలుబు, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి శారీరక సమస్యలకు ఇంట్లో ఉండే మసాలా దినుసులే మంచి మెడిసిన్. ఈ విషయం  ఆయుర్వేద వైద్యుని వద్దకు వెళ్లినా మసాలా దినుసుల ఉపయోగం గురించి తెలుస్తుంది. ఈ మసాలా దినుసులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే.. ఈజీగా సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. పులావ్‌లు, బిర్యానీలు.. నాన్ వెజ్ వంటి ఆహారపదార్ధాలను తయారు చేసే సమయంలో మసాలా పదార్ధాలను ఉపయోగిస్తుంటారు. వాటిల్లో అనాస పువ్వు ఒకటి. దీనిని స్టార్‌ అనిస్‌ అని కూడా అంటారు. మంచి సుగంధబరితమైన వాసనతో పాటు రుచి ఉండే ఈ అనాస పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  అనాస పువ్వు వలన కలిగే లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కంటి సమస్యలకు చక్కటి నివారిణి అనాస పువ్వు. దీనిలో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును పెంచుతుంది.

*దీనిలో విటమిన్‌ సి కూడా ఉంటుంది. కనుక రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. జ్వరం వచ్చినవారు ఈ పువ్వుని తీసుకుంటే త్వరగా జ్వరం తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

*ఈ పువ్వులో థైమోల్‌, టెర్పినోల్‌ అనబడే సమ్మేళనాలు ఉన్నాయి. కనుక శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. కఫన్నీ తగ్గిస్తుంది.

* వికారం, వాంతుల సమస్యకు చక్కటి పరిష్కారం అనాస పువ్వు.

*రుతుక్రమం సమయంలో ఇబ్బంది పడే మహిళలకు మంచి రెమిడీ అనాస పువ్వు.. అధిక రక్తస్రావాన్ని అరికట్టడమే కాదు.. కడుపు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.

*అనాస పువ్వు మహిళల్లో హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.

*మలబద్దకం, జీర్ణ సమస్యలు, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నవారికి చక్కటి మెడిసిన్ అనాస పువ్వు

* సీజనల్ సమస్యల నుంచి ఉపశమనం కోసం.. అనాస పువ్వును నీటిలో వేసి మరిగించి రోజూ ఒక కప్పు నీటిని తాగాలి. రోజులో ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఈ అనాసపువ్వు నీటిని తాగినా ప్రయోజనం కలుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇచ్చిన సమాచారం.. అవగాహన కోసమే.. ఈ చెట్టు ఆకులని ఉపయోగించే ముందు ఆరోగ్య నిపుణులను లేదా వైద్యులను సంప్రదించి ఉపయోగించాల్సి ఉంటుంది. )

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?