Telangana: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్నంటే..?

గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వాప్తంగా 22,662 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 219 కేసులు నమోదయ్యాయి. కాగా.. 76 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

Telangana: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్నంటే..?
Coronavirus
Follow us

|

Updated on: Jun 14, 2022 | 9:21 PM

Telangana’s Covid-19 cases: కరోనావైరస్ కేసులు మళ్లీ చాపకింద నీరులా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా కరోనా కేసులు సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు 200 మార్క్‌‌ను దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వాప్తంగా 22,662 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 219 కేసులు నమోదయ్యాయి. కాగా.. 76 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌‌ను మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. మరణాలు నమోదు కాలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,259 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే 164 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 19, మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత కేసుల సంఖ్య 200 మార్క్ దాటడం ఇదే తొలిసారి.

తెలంగాణలో కేసుల వివరాలు..

ఇవి కూడా చదవండి
  • రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,94,803
  • కోలుకున్న వారి సంఖ్య 7,89,433
  • మరణాల సంఖ్య 4,111
Telangana Corona Cases

Telangana Corona Cases

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..