Trs vs Bjp: తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. రాష్ట్ర నేతలు దేశ రాజధానికి.. దేశ నేతలు హైదరాబాద్‌కు!
Trs vs Bjp: టీఆర్‌ఎస్, బీజేపీ పోటా పోటీ కార్యాచరణతో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. ఎన్నికలకు ఏడాది ముందే.. ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ
Trs vs Bjp: టీఆర్‌ఎస్, బీజేపీ పోటా పోటీ కార్యాచరణతో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. ఎన్నికలకు ఏడాది ముందే.. ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందకు వెళ్తున్నారు. జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెడితె.. తెలంగాణలో కమలం జెండా ఎగరేసేందకు బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సీఎం కేసీఆర్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. మేధావులతో పాటు పలు జాతీయ నేతలతో భేటీ కావడమే కాకుండా.. ప్రత్యేక పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు గులాబీ బాస్. ఈ క్రమంలో కేసీఆర్ జాతీయ పార్టీ పెడతారంటూ ఓవైపు వార్తలు వస్తుంటే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు కమలం పార్టీ నాయకులు.
హెచ్ఐసీసీ వేదికగా వచ్చే నెల 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాని మోదీ సాహా, కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశాలతో తెలంగాణ పై పట్టు సాధించాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. సమావేశాల నిర్వహణపై ఐదు విభాగాలుగా 34 కమిటీలు వేశారు. వీటిని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సమావేశాల కోసం జాతీయ నేతలతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది బీజేపీ.
జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి లోటు లేకుండా తెలంగాణ అథిద్యం చూపించాలని అనుకుంటున్నారు. ఇక హైదరాబాద్ లో ప్రధాని మోడీ తో కీలక నాయకులు పెట్టే సభతో పార్టీ కార్యకర్తల్లో జోష్ పెంచుతుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ శక్తులను ఏకం చేసే ప్రయత్నంలో ఉన్నారు సీఎం కేసీఆర్.