Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మరో గంటలో భారీ వర్షం.. అప్రమత్తంగా ఉండాలి: GHMC

మరో గంటలో హైదరాబాద్‌ సిటీలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు. జంట నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.

Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మరో గంటలో భారీ వర్షం.. అప్రమత్తంగా ఉండాలి: GHMC
Rains
Follow us

|

Updated on: Jun 14, 2022 | 6:18 PM

Alert for Hyderabad residents: మరో గంటలో హైదరాబాద్‌ సిటీలో ఏం జరగబోతోంది..? ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారుల వార్నింగ్‌ ఇచ్చారు. నైరుతి రుతుపవనాల ఎంట్రీతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు మంగళవారం సాయంత్రం హెచ్చరించారు. దాంతో మరో గంటలో హైదరాబాద్‌ సిటీలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు. జంట నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.

కాగా.. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. సోమవారం రాష్ట్రంలోని మహబూబ్ నగర్‌లోకి ప్రవేశించిన రుతుపవనాలు.. మంగళవారం మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది.

మంగళవారం కూడా నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి
Imd

Imd

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..