Hyderabad: కూతుళ్లకు పెళ్లి కావడం లేదని మనస్థాపం.. చివరకు తండ్రి ఏం చేశాడంటే..?
సికింద్రాబాద్ వారాసిగూడ ప్రాంతానికి చెందిన కొల్లూరి కనకేశ్వర్ (59).. అవుసుల పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కనకేశ్వర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Father commits suicide: కుమార్తెలను అల్లారు ముద్దుగా పెంచాడు.. వారు ఏ చేసినా మురిసిపోతూ ఆనందించేవాడు.. అలాంటి కుమార్తెలకు వివాహం కావడం లేదన్న కారణంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో చోటుచేసుకుంది. అంబర్ పేట పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ వారాసిగూడ ప్రాంతానికి చెందిన కొల్లూరి కనకేశ్వర్ (59).. అవుసుల పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కనకేశ్వర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి పెళ్లిడూ వచ్చిన వివాహం కాకపోవడంతో ఆయన ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండేవాడు. కూతుళ్లకు వివాహం కావడం లేదని.. తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన జీవితంపై విరక్తి కలిగిందని, ఆత్మహత్య చేసుకుంటానని తరచూ చుట్టుపక్కల వారికి చెబుతుండేవాడు.
ఈ క్రమంలో ఈ నెల 11న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు 12న చిలకలగూడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే.. సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని మృతదేహం మూసారాంబాగ్ బ్రిడ్జి నుంచి దుర్గానగర్ వైపు కొట్టుకువచ్చింది. మృతదేహాన్ని గమనించిన ప్రయాణికులు మొదట మలక్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. మలక్‌పేట పోలీసులు వచ్చి చూసి.. ఈ ఏరియా అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుందని వారికి సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అంబర్‌పేట పోలీసులు మృతదేహాన్ని మూసీనది నుంచి బయటకు తీసి పరిశీలించారు. జేబులో ఆధార్ కార్డు లభించడంతో.. దీని ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..