Revanth Reddy: హత్యలు, అత్యాచారాలు దాటి పోలీసు వాహనాలపై దాడులా.. ఎక్కడికెళ్తోంది మన రాష్ట్రం..
హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో అర్ధరాత్రి యువకులు హల్చల్ సృష్టించిన దానిపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనే అంటూ ట్వీట్ చేశారు. ఆసిఫ్ నగర్ లో మందుబాబులు..
తెలంగాణలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై ప్రతిపక్షనేతలు మండిపడుతున్నారు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో అర్ధరాత్రి యువకులు హల్చల్ సృష్టించిన దానిపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనే అంటూ ట్వీట్ చేశారు. ఆసిఫ్ నగర్ లో మందుబాబులు పోలీసు వాహనం ఎక్కి వీరంగం వేసిన వీడియోను పోస్ట్ చేశారు. వాహనం అద్దాలు ధ్వంసం చేశారని మండిపడ్డారు. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు దాటి.. పోలీసు వాహనాలపై దాడులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హైదరాబాద్ నగరాన్ని.. ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా..!? అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. పౌర సమాజం రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై ఆలోచన చెయ్యాలని రేవంత్ రెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనే… ఆసిఫ్ నగర్ లో మందుబాబులు పోలీసు వాహనం ఎక్కి వీరంగం వేసి, వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు దాటి పోలీసు వాహనాలపై దాడులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చింది. ఈ నగరాన్ని… ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా!? పౌర సమాజం ఆలోచన చెయ్యాలి. pic.twitter.com/jIHrYnBtZi
— Revanth Reddy (@revanth_anumula) June 14, 2022
సోమవారం అర్థరాత్రి హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో యువకులు పెద్ద ఎత్తున రచ్చ చేశారు. గంజాయి సేవించి మత్తులో పోలీసు వాహనం పై ఎక్కి నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే.. స్థానిక సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులో తీసుకునే ప్రయత్నం చేయగా వాహనంపైకి ఎక్కి నానా యాగి చేయడమే కాకుండా.. పోలీసు వాహనంతో పాటు ఇతర వాహనాల అద్దాలు పగలగొట్టారు. స్థానికుల సహాయంతో గంజాయి గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేశారు పోలీసులు. అయితే.. ఈ క్రమంలో కొందరు తప్పించుకోగా.. అజయ్ అనే యవకుడిని అసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే వీరు ఇంతలా రెచ్చిపోవాడానికి గల కారణాలపై పోలీసులు తేల్చేపనిలో ఉన్నారు. వీరికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనేది తేల్చేందుకు రెడీ అవుతున్నారు హైదరాబాద్ పోలీసులు.