Agneepath Scheme: అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం.. రూ.48 లక్షల జీవిత బీమా: మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
Agneepath Scheme: త్రివిధ, సాయుధ దళాల నియమాకాల్లో కొత్త విధానాన్ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం..
Agneepath Scheme: త్రివిధ, సాయుధ దళాల నియమాకాల్లో కొత్త విధానాన్ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద ఎపికైన వారికి సైనిక బలగాల్లో కొత్త ర్యాంకు ఇస్తూ అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పాలసీని కేంద్రం ప్రకటించింది. ఈ పథకాన్ని ప్రారంభించిన రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. త్రివిధ దళాల్లో స్వల్పకాలిక నియమాకాలు చేపట్టనుంది. అగ్నివీర్‌కు ఎంపికైనవారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత ఉద్యోగాల నుంచి రిలీవ్ చేయనున్నారు. 25 శాతం మందికి తాత్కాలికంగా సర్వీస్‌లో కొనసాగించనున్నట్లు చెప్పారు.
వీరికి ఏడాదికి రూ.11 లక్షల వేతనం ఉంటుందని, 15ఏళ్ల సర్వీస్ అనంతరం పెన్షన్ సదుపాయం ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అగ్నివీర్ విభాగానికి కొత్త లోగో, కొత్త యూనిఫాం ఉంటుందని పేర్కొన్నారు. నెలకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు జీతం ఉంటుందని, అలాగే రూ.48 లక్షల వరకు జీవిత బీమా కల్పించనున్నట్లు వెల్లడించారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలో నాలుగేళ్ల సర్వీస్ ఉంటుందని, నాలుగేళ్ల సర్వీస్ అనంతరం అగ్నివీర్ సర్టిఫికేట్ అందించనున్నట్లు చెప్పారు. అగ్నివీర్ సర్వీస్ తర్వాత ఇతర ఉద్యోగాలకూ అవకాశం ఉంటుందని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి