Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Caste Certificate: మీకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ ప్రయోజనం పొందాలా..? వెంటనే ఈ పని పూర్తి చేయండి..!

Caste Certificate: దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్‌కు సంబంధించిన అనేక సేవల ప్రయోజనాలను ప్రభుత్వం అందిస్తోంది. అన్ని ప్రధాన పత్రాలను ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి..

Caste Certificate: మీకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ ప్రయోజనం పొందాలా..? వెంటనే ఈ పని పూర్తి చేయండి..!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 14, 2022 | 7:13 AM

Caste Certificate: దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్‌కు సంబంధించిన అనేక సేవల ప్రయోజనాలను ప్రభుత్వం అందిస్తోంది. అన్ని ప్రధాన పత్రాలను ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి అయిపోతోంది. ఇందులో కుల ధృవీకరణ పత్రం కూడా ఉంది. ప్రతి పౌరుడు తన కుల ధృవీకరణ పత్రాన్ని ఆధార్‌తో అనుసంధానించడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థులకు గరిష్ట రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. దీంతో రిజర్వేషన్‌ విషయంలో ఈ ప్రయోజనం పొందవచ్చు. కుల ధృవీకరణ పత్రాన్ని ఆధార్‌తో లింక్ చేయడం వల్ల రిజర్వేషన్‌కు అర్హులైన విద్యార్థుల నిజమైన గుర్తింపు లభిస్తుంది. ఇది అవినీతిని నిరోధించడంలో సహాయపడుతుంది. కుల ధృవీకరణ పత్రాన్ని ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఇతర తరగతుల SC లేదా ST విద్యార్థుల హక్కులను హరించరు. ఏ సందర్భంలోనైనా కుల ధ్రువీకరణ పత్రాన్ని ఆధార్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం చెప్పడానికి ఇదే కారణం.

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) విద్యార్థులు తమ కుల ధృవీకరణ పత్రంతో ఆధార్‌ను లింక్ చేయడాన్ని సులభతరం చేసింది. విద్యార్థుల నుంచి కుల ధ్రువీకరణ పత్రం సేకరించి సంబంధిత అధికారులకు పంపాల్సి ఉండడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడికే ఈ పని అప్పగించింది. ఈ అధికారులతో కుల ధృవీకరణ పత్రం ఆధార్‌తో అనుసంధానించబడి ఉంటుంది. తమ రాష్ట్రంలోని విద్యార్థుల కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రాలను వారి ఆధార్‌తో అనుసంధానించడానికి వీలుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

కుల ధృవీకరణ పత్రం-ఆధార్ లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:

ఇవి కూడా చదవండి

కుల ధృవీకరణ పత్రంతో ఆధార్‌ను లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. లింక్ చేయకుంటే వచ్చే నష్టమేంటి. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 1 లక్ష కంటే తక్కువ, SC, ST లేదా OBC వర్గానికి చెందిన విద్యార్థులు, కుల ధృవీకరణ పత్రంతో ఆధార్‌ను లింక్ చేయడం ద్వారా ఉన్నత విద్య కోసం స్కాలర్‌షిప్ ఇవ్వబడుతుంది. అలాంటి విద్యార్థుల కుల ధృవీకరణ పత్రాన్ని ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే, స్కాలర్‌షిప్ ప్రయోజనం లభించదు.

మీరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)లో రిజర్వేషన్ ప్రయోజనం పొందాలనుకుంటే SC, ST లేదా OBC విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రాన్ని ఆధార్‌తో లింక్ చేయడం అవసరం. అలాంటి విద్యార్థులకు ఐఐటీలు, ఐఐఎంల వంటి విద్యాసంస్థల్లో 49 శాతం వరకు రిజర్వేషన్ల ప్రయోజనం ఉంటుంది. అయితే కుల ధృవీకరణ పత్రంతో ఆధార్‌ను అనుసంధానం చేసినప్పుడే ఇది జరుగుతుంది. కుల ధృవీకరణ పత్రం ఆధార్‌తో లింక్ చేయబడితే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు ఫారమ్ కోసం SC, ST లేదా OBC కేటగిరీల నుండి వచ్చే అభ్యర్థులకు తక్కువ ఛార్జీ విధించబడుతుంది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు కూడా కొన్ని సీట్లు రిజర్వ్ చేయబడతాయి. ఇలా ఉద్యోగాల విషయంలో కేంద్రం ప్రతి ఒక్కరు ఆధార్‌తో కుల ధృవీకరణ లింక్‌ చేయాలని సూచిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి