AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Debit Credit Card Rule: కస్టమర్లు అలర్ట్‌.. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లింపుల కోసం కొత్త నిబంధనలు.. జూలై 1 నుంచి అమలు..!

Debit Credit Card Rule: బ్యాంకింగ్‌ రంగంలో రోజురోజుకు కొత్త నిబంధనలు అమలు అవుతున్నాయి. ప్రతి నెల 1వ తేదీ నుంచి ఆర్బీఐ బ్యాంకింగ్‌ రంగంలో ఏదో ఒక నిబంధనలు మారుస్తుంటుంది...

Debit Credit Card Rule: కస్టమర్లు అలర్ట్‌.. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లింపుల కోసం కొత్త నిబంధనలు.. జూలై 1 నుంచి అమలు..!
Subhash Goud
| Edited By: Team Veegam|

Updated on: Jun 13, 2022 | 4:06 PM

Share

Debit Credit Card Rule: బ్యాంకింగ్‌ రంగంలో రోజురోజుకు కొత్త నిబంధనలు అమలు అవుతున్నాయి. ప్రతి నెల 1వ తేదీ నుంచి ఆర్బీఐ బ్యాంకింగ్‌ రంగంలో ఏదో ఒక నిబంధనలు మారుస్తుంటుంది. ఇక ప్రస్తుత డిజిటలైజేషన్‌లో బ్యాంకింగ్‌ లావాదేవీలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో నగదు బదిలీలు చేయాలన్నా.. ఇతరులకు డబ్బులు చెల్లించాలన్నా బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించాల్సి ఉండేది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులోకి రావడంతో సులభతరం అయ్యాయి. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల నుంచి సాధరాణ దుకాణాల్లోనూ కస్టమర్లకు ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అలాగే డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మార్పులు తీసుకువస్తోంది. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

జూలై నెల నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు డెబిట్‌, క్రెడిట్‌ కార్డు టోకేనైజేషన్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. గత సంవత్సరం ఆర్బీఐ, బ్యాంకులు,ఆర్థిక సంస్థలు ఈ ఫ్రేమ్‌వర్క్‌పై కసరత్తు చేస్తున్నాయి. జనవరి 1 నుంచే అమలు చేయాల్సి ఉండగా, బ్యాంకుల కోరిక మేరకు మరో ఆరు నెలల పాటు గడువు పొడిగించారు. ఇప్పుడు గడువు పూర్తి కావడంతో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

టోకెనైజేషన్‌ అమలు గురించి 2020 మార్చి 17న ఆర్బీఐ మర్చంట్స్‌,బ్యాంకులకు తెలియజేసింది. ఇందుకు సంబంధించి గత సంవత్సరం డిసెంబర్‌ 23న కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2020 జూన్‌ 30నుంచి డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల సమాచారం భద్రపర్చడాన్ని నిషేధిస్తున్నామని, పేమెంట్‌ అగ్రిగేటర్లు, పేమెంట్‌ గేట్‌వేలు, నాన్‌ బ్యాంక్‌ పేమెంట్‌ అగ్రిగేటర్లు,మార్చంట్స్‌లకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారమని ఆర్బీఐ తెలిపింది. పరిశ్రమలోని భాగస్వాముల విజ్ఞప్తి మేరకు తుది గడువును 2021 డిసెంబర్‌ 3 నుంచి పొడిగిస్తున్నామని ఆర్బీఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి

టోకెనైజేషన్‌ ఏంటి?

మీరు లావాదేవీలు చేపట్టేటప్పుడు డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. కార్డు మీదున్న 16 అంకెలు, కార్డు ఎక్స్‌పైరీ డేట్‌, సీవీవీ, ఓటీపీ, పిన్‌ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్ని సరిగ్గా ఉంటేనే లావాదేవీలు జరిపేందుకు వీలుంటుంది. లేకుంటే అనుమతించదు. ఈ ప్రక్రియ అంతా ఇకపై టోకెనైజేషన్‌ భర్తీ చేస్తుంది. ఇందుకు మీ కార్డు వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. మీ కార్డుకు సంబంధించిన టోకెనైజేషన్‌ నమోదు చేస్తే చాలు. అలాగే కస్టమర్లు తమ కార్డును టోకెన్‌ రిక్వెస్ట్‌ అందించే ఒక ప్రత్యేక యాప్‌ ద్వారా టోకెనైజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టోకెన్ రిక్వెస్టర్‌ వినియోగదారుడి అభ్యర్థనను కార్డ్ నెట్‌వర్క్‌కు చేరవేస్తుంది. కార్డు జారీ చేసిన సంస్థ అనుమతితో చివరిలో టోకెన్‌ జారీ అవుతుంది. కాంటాక్ట్‌లెస్ కార్డు లావాదేవీలు, క్యూఆర్ కోడ్‌లు, యాప్‌ల ద్వారా చెల్లింపులకు టోకెనైజేషన్‌ను అనుమతించారు.

మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు కార్డ్ వివరాలు ఎంటర్ చేయకుండా టోకెన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కార్డ్ నెట్‌వర్క్‌ ఈ టోకెన్ క్రియేట్ చేస్తుంది. సదరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో మీ కార్డ్ వివరాల బదులు టోకెన్ మాత్రమే సేవ్ అయి ఉంటుంది. ఆ టోకెన్ ద్వారానే ఇతర లావాదేవీలు జరపడానికి వీలవుతుంది. అయితే ప్రతీ లావాదేవీకి సీవీవీ, ఓటీపీ ఎంటర్ చేయడం తప్పనిసరి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి