AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC Bank: పాక్ కార్డు అప్డేట్ మోసాల విషయంలో HDFC కీలక సూచనలు.. బ్యాంక్ ఏమందంటే..

HDFC Bank: పాన్ అనేది ప్లాస్టిక్ కార్డ్ రూపంలో ఆదాయపు పన్ను శాఖ అందించే పది అంకెల విశిష్ట ఆల్ఫాన్యూమరిక్ నంబర్. ఈ పాన్ కార్డ్ ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి అత్యంత ముఖ్యమైన పత్రాల్లో ఒకటి.

HDFC Bank: పాక్ కార్డు అప్డేట్ మోసాల విషయంలో HDFC కీలక సూచనలు.. బ్యాంక్ ఏమందంటే..
Hdfc Bank
Ayyappa Mamidi
|

Updated on: Jun 13, 2022 | 3:47 PM

Share

HDFC Bank: పాన్ అనేది ప్లాస్టిక్ కార్డ్ రూపంలో ఆదాయపు పన్ను శాఖ అందించే పది అంకెల విశిష్ట ఆల్ఫాన్యూమరిక్ నంబర్. ఈ పాన్ కార్డ్ ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి అత్యంత ముఖ్యమైన పత్రాల్లో ఒకటి. కొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి లేదా ఇప్పటికే ఉన్న దానిని అప్‌డేట్ చేయడానికి, ఒక వ్యక్తి ఆదాయపు పన్ను పోర్టల్, UTI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (UTIITSL) వినియోగించవచ్చు. దీనికి తోడు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) లేదా PAN సర్వీస్ సెంటర్లు, TIN ఫెసిలిటేషన్ సెంటర్‌లను సంప్రదించవచ్చు. కానీ.. సైబర్ ఫ్రాడ్స్ బాగా పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో మోసగాళ్లు పాన్ కార్డుల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. పాన్ కార్డు అప్డేట్ చేసుకోవాలని, బ్లాక్ అయిన మీ పాన్ కార్డును అన్ బ్లాక్ చేసుకోవాలంటూ బోగస్ మెసేజ్ లను పంపుతున్నారు. వీటిని నమ్మి సదరు మెసేజ్ లకు స్పందిస్తే ఇక పని అంతే. ఇలాంటి మోసాలకు అనేక మంది ఈ రోజుల్లో బలైపోతున్నారు. ఈ తరుణంలో వినియోగదారులను అప్రమత్తం చేసే పనిలో పడింది దేశంలోని అతిపెద్ద పైవేటు రంగ బ్యాంక్ HDFC. పాన్ వివరాలను అప్‌డేట్ చేయాలంటూ అడిగే తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దని వినియోగదారులను హెచ్చరించింది.

మీ వివరాలను SMS లేదా కాల్ ద్వారా షేర్ చేయమని బ్యాంక్ మిమ్మల్ని ఎప్పుడూ అడగదని HDFC బ్యాంక్ కస్టమర్‌లు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది. హెచ్‌డిఎఫ్‌సి మాత్రమే కాదు.. దేశంలోని ప్రతి బ్యాంక్, ఆర్థిక సంస్థ వ్యక్తిగత ఖాతా వివరాలను తెలపమని కస్టమర్లను కోరదని వెల్లడించింది. HDFC బ్యాంక్ కస్టమర్ల విషయంలో అధికారిక నంబర్ 186161 లేదా ID HDFCBK/HDFCBN నుంచి SMS అందుతుంది. SMSలోని లింక్‌లు ఎల్లప్పుడూ అధికారిక డొమైన్ hdfcbk.io నుండి ఉంటాయని బ్యాంక్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

ఫలితంగా బ్యాంక్ హెచ్చరిక ఏమిటంటే.. కస్టమర్లు కాన్ఫిడెన్షియల్ వివరాలను షేర్ చేయమని SMS ద్వారా పొందే తెలియని లింక్‌లపై క్లిక్ చేయకూడదని, తెలియని నంబర్ నుంచి కాల్ వస్తే స్పందిచవద్దని సూచించింది. ఏదైనా నకిలీ SMS లేదా కాల్ వచ్చినట్లయితే ఖాతాదారులు వెంటనే బ్యాంకుకు రిపోర్ట్ చేయాలి లేదా సైబర్ పోలీసులకు ఫిర్యాదును ఫైల్ చేయడానికి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ని కూడా సందర్శించవచ్చు.