Future Retail Case: అమెజాన్ కు ఎదురుదెబ్బ.. 45 రోజుల్లో పెనాల్డీ రూ.200 కోట్లు చెల్లించాలని ఆదేశం..
Future Retail Case: గత కొంత కాలంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, ఫ్యూచర్ రిటైల్ కంపెనీల మధ్య ఫ్యూచర్ కూపన్‌ల డీల్ విషయంలో వివాదం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో అమెజాన్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Future Retail Case: గత కొంత కాలంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, ఫ్యూచర్ రిటైల్ కంపెనీల మధ్య ఫ్యూచర్ కూపన్‌ల డీల్ విషయంలో వివాదం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో అమెజాన్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించిన రూ.202 కోట్ల రూపాయల పెనాల్టీని 45 రోజుల్లోగా చెల్లించాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT) తీర్పును సమర్ధించింది. జస్టిస్ ఎం. వేణుగోపాల్, అశోక్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అమెజాన్ డీల్ కోసం.. 2019లో ఇచ్చిన ఆమోదాన్ని గత ఏడాది డిసెంబర్‌లో కాంపిటిషన్ కమిషన్ సస్పెండ్ చేసింది.
అప్పటి లావాదేవీకి అనుమతులు కోరుతూ అమెజాన్ సమాచారాన్ని కావాలనే వెల్లడించలేదని.., ఇందుకు గాను కంపెనీపై రూ. 202 కోట్ల జరిమానా విధించినట్లు రెగ్యులేటర్ పేర్కొంది. FCPL అనేది ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ ప్రమోటర్ ప్రమోటర్ కంపెనీ. రూ. 24,713 కోట్ల డీల్‌లో భాగంగా రిలయన్స్ రిటైల్‌కు ఆస్తులను విక్రయించే FRL ఒప్పందాన్ని అమెజాన్ వ్యతిరేకిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అది ఇప్పుడు రద్దు చేయబడింది. ఈ ఒప్పందాన్ని ఈ-కామర్స్ మేజర్ దాని 2019 లావాదేవీకి ముడిపెడుతూ వ్యతిరేకిస్తోంది. దీని ద్వారా ఈ కామర్స్ దిగ్గజం FCPLలో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. గతంలో ఈ పెనాల్టీ విషయంలో అమెజాన్ సుప్రీ కోర్టును సైతం ఆశ్రయించింది. కానీ.. ఇరు పక్షాలు ఈ విషయాన్ని NCLATలో తెల్చుకోవాలని అప్పట్లో అత్యున్నత ధర్మాసనం సూచించింది.
NCLAT అమెజాన్ అభ్యర్థనపై ఈ ఏడాది ఏప్రిల్‌లో తన విచారణను ముగించింది. సోమవారం అమెజాన్ అభ్యర్థనతో పాటు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT), ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన కేసులో అప్పీలేట్ ట్రిబ్యునల్ మరో రెండు పిటిషన్లపై ఆర్డర్‌ను రిజర్వ్ చేసింది.