Supreme Court: సహజీవనంలో ఉంటే ఆ జంట పెళ్లి చేసుకున్నట్లే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

ఒక జంట పెళ్లి చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల.. వారికి పుట్టిన అక్రమ సంతానానికి పూర్వీకుల ఆస్తిలో ఎలాంటి వాటా దక్కదంటూ కేరళ హైకోర్టు 2009లో తీర్పునిచ్చింది.

Supreme Court: సహజీవనంలో ఉంటే ఆ జంట పెళ్లి చేసుకున్నట్లే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
Supreme Court
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 14, 2022 | 2:25 PM

Supreme Court on living relationship: సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. ఒక పురుషుడు, మహిళ దీర్ఘకాలం పాటు సహజీవనం చేస్తే వారి మధ్య బంధాన్ని వివాహంగానే చట్టం పరిగణిస్తుందంటూ స్పష్టంచేసింది. దాన్ని అక్రమ సంబంధంగా భావించకూడదంటూ సుప్రీం కోర్టు సోమవారం సూచించింది. సహజీవనం చేసిన అలాంటి జంటకు పుట్టిన సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటాను నిరాకరించరాదంటూ ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఒక జంట దీర్ఘకాలంగా సహజీవనం చేసింది. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల.. వారికి పుట్టిన అక్రమ సంతానానికి పూర్వీకుల ఆస్తిలో ఎలాంటి వాటా దక్కదంటూ కేరళ హైకోర్టు 2009లో తీర్పునిచ్చింది. జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనతో విభేదించింది.

ఒక జంట.. భార్యాభర్తల్లా దీర్ఘకాలం పాటు కలిసి ఉన్నారంటే.. వారు వివాహం చేసుకున్నట్లుగానే భావించాలని న్యాయస్థానం స్పష్టంచేసింది. సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్‌ 114 ఇదే సూచిస్తోందని తెలిపింది. వారు పెళ్లి చేసుకోలేదని స్పష్టంగా రుజువైతే తప్ప వారి బంధాన్ని ఈ విధంగానే పరిగణించాలంటూ ధర్మాసనం పేర్కొంది. దీనిని ఎవరైనా సవాల్‌ చేయవచ్చంటూ పేర్కొంది. అయితే వారు వివాహం చేసుకోలేదని రుజువు చేయాల్సిన బాధ్యత.. ఇలా సవాల్‌ చేసిన వారిపైనే ఉంటుందంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది.

ఈ కేసులో తుది డిక్రీ జారీ ప్రక్రియను ట్రయల్‌ కోర్టు ఆలస్యం చేయడాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తప్పుబట్టింది. ఆస్తి పంపకం దావాల్లో ప్రాథమిక డిక్రీ ఇచ్చిన వెంటనే తుది డిక్రీ జారీకి చర్యలు ప్రారంభించాలంటూ దేశంలోని అన్ని కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశిస్తూ.. నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..