AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: చిన్న పిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

777 చార్లీ అనే సినిమా ఇప్పుడు అందరినీ కంటతడిపెట్టిస్తోంది. ఈ సినిమా చూసి ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంతే ఏడ్చేశారు.. ఆ సినిమా చూస్తూ ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారని తెలిసింది.

Viral: చిన్న పిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
Cm Basavaraj Bommai
Jyothi Gadda
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 14, 2022 | 5:23 PM

Share

777 చార్లీ అనే సినిమా ఇప్పుడు అందరినీ కంటతడిపెట్టిస్తోంది. ఈ సినిమా చూసి ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంతే ఏడ్చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై 777 చార్లీ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సినిమాలో పెంపుడు కుక్కతో ఒక వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని చూపించారు. అయితే సీఎం బొమ్మైకి చనిపోయిన తన పెంపుడు కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అందరి ముందే వెక్కివెక్కి ఏడ్చేశారు. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. పెంపుడు కుక్కతో అనుబంధాన్ని చాటే.. ఆ సినిమా చూస్తూ ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు.

సినిమా చూసిన అనంతరం సీఎం బొమ్మై మాట్లాడుతూ కుక్కల గురించి చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ఈ సినిమాలో జంతువులతో ఉండే అనుబంధం, భావోద్వేగాన్ని చాలా గొప్పగా చూపించారని కొనియారు. కుక్క తన భావోద్వేగాలను కండ్ల ద్వారా వ్యక్తపరుస్తుంది. సినిమా చాలా బాగుంది.. అందరూ చూడదగిన సినిమా అన్నారు. కుక్కల ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ. ఇది స్వచ్ఛమైన ప్రేమ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై స్వతహాగా కుక్కల ప్రేమికుడు. గతేడాది తన పెంపుడు కుక్క చనిపోవడంతో ఆయన చాలా బాధపడ్డారు. పెంపుడు కుక్క మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన బోరున విలపిస్తున్న ఫోటోలు అప్పట్లోనూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

777 చార్లీ మూవీని వీక్షించిన ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై..

సినిమాను చూశాక కంటతడి పెట్టుకున్న బొమ్మై…

Also Read: PM Modi: జాతీయ ఐక్యతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.. పూణెలో తుకారాం మహారాజ్ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..

Air India: ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షల జరిమానా.. ప్రయాణికుల విషయంలో ఆ తప్పు చేసినందుకే