FD Rates Hike: PNB కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్..

FD Rates Hike: రిజర్వు బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కీలక వడ్డీ రేట్లను పెంచడంతో బ్యాంకులు సైతం తమ వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఈ క్రమంలో.. దేశంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది.

FD Rates Hike: PNB కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్..
Punjab National Bank
Follow us

|

Updated on: Jun 14, 2022 | 3:13 PM

FD Rates Hike: రిజర్వు బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కీలక వడ్డీ రేట్లను పెంచడంతో బ్యాంకులు సైతం తమ వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఈ క్రమంలో.. దేశంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ₹2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ జూన్ 14, 2022న ఈ ప్రకటనను విడుదల చేసింది. బ్యాంక్ ఒక సంవత్సరం నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు వెల్లడించింది.

వివిధ కాలపరిమితులకు PNB FD రేట్ల వివరాలు ఇలా..

7 నుంచి 45 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటును, 46 నుంచి 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.25 శాతం వడ్డీ రేటును బ్యాంక్ కొనసాగిస్తోంది. 91 నుంచి 179 రోజుల్లో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై 4.00 శాతం వడ్డీని చెల్లిస్తోంది. అయితే.. 180 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీని అందిస్తోంది. PNB ఇప్పుడు ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల వరకు డిపాజిట్లపై 5.20 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. ఇది గతంలో 5.10 శాతంగా ఉండేది.

రెండు సంవత్సరాల కంటే ఎక్కువ, మూడు సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 5.30 శాతం వడ్డీ రేటును అందిస్తున్నట్లు తెలిపింది. గతంలో 5.10 శాతంగా ఉన్న వడ్డీ రేటును తాజాగా.. 20 బేసిస్ పాయింట్లు బ్యాంక్ పెంచింది. PNB ఇప్పుడు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ, ఐదు సంవత్సరాల వరకు ఉండే ఫిక్స్ డ్ డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ రేటును చెల్లిస్తోంది. గతంలో ఇది 5.25 శాతంగా ఉండేది. అంటే బ్యాంక్ ఈ కాలపరిమితికి చేసే డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ.. అంటే 10 సంవత్సరాల వరకు చేసే డిపాజిట్లపై 35 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును పెంచింది. రెగ్యులర్ కస్టమర్లకు 5.50 శాతం వడ్డీ రేటుతో, సీనియర్ సిటిజన్లకు 6 శాతం వడ్డీతో 1111 రోజుల కొత్త కాలవ్యవధిని బ్యాంక్ అమలు చేస్తోంది. వడ్డీ రేట్ల సవరణకు సంబంధించిన పూర్తి వివరాలను బ్యాంక్ ఇప్పటికే తన వెబ్‌సైట్‌లో ఉంచింది.