AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video viral: ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఇలా కూడా వాడుకుంటారా.? ఈ వ్యక్తి చేసిన పనికి ఫ్యూజులు ఎగరాల్సిందే!

సోషల్ మీడియాలో ఫన్నీ, వీడియోలకు కొరత లేదు. ప్రతిరోజూ ఇలాంటి వీడియోలు అనేకం వైరల్‌ అవుతుంటాయి. ఇంటర్నెట్‌ వాడకం పెరిగిపోవడంతో సోషల్‌ మీడియాలో జనం తమ వీడియోలను పోస్ట్‌ చేస్తూ..రాత్రికి రాత్రే సెలబ్రిటీలు కావడం ఇటీవల షరా మామూలుగా మారింది. ఈ క్రమంలో ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులోని కొన్ని వీడియోలు నెటిజన్లుకు వినోదాన్ని పంచుతూ వైరల్‌గా మారుతున్నాయి కూడా. సరిగ్గా అలాంటి ఓ ఫన్నీ వీడియో తాజాగా వైరల్‌ […]

Video viral: ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఇలా కూడా వాడుకుంటారా.? ఈ వ్యక్తి చేసిన పనికి ఫ్యూజులు ఎగరాల్సిందే!
Man Resting On Scooty
Jyothi Gadda
|

Updated on: Jun 14, 2022 | 12:49 PM

Share

సోషల్ మీడియాలో ఫన్నీ, వీడియోలకు కొరత లేదు. ప్రతిరోజూ ఇలాంటి వీడియోలు అనేకం వైరల్‌ అవుతుంటాయి. ఇంటర్నెట్‌ వాడకం పెరిగిపోవడంతో సోషల్‌ మీడియాలో జనం తమ వీడియోలను పోస్ట్‌ చేస్తూ..రాత్రికి రాత్రే సెలబ్రిటీలు కావడం ఇటీవల షరా మామూలుగా మారింది. ఈ క్రమంలో ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులోని కొన్ని వీడియోలు నెటిజన్లుకు వినోదాన్ని పంచుతూ వైరల్‌గా మారుతున్నాయి కూడా. సరిగ్గా అలాంటి ఓ ఫన్నీ వీడియో తాజాగా వైరల్‌ అవుతోంది. ఓ వ్యక్తి రద్దీగా ఉన్న నడిరోడ్డుపై బైక్‌మీదనే విశ్రాంతి తీసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజ‌న్లు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో గురించి తెలుసుకునే ముందుగా, మీకో ప్రశ్న..అదేంటంటే..మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ మధ్యలో టూవీలర్‌పై విశ్రాంతి తీసుకున్నారా? తల వంచుకుని పడుకోవటం కాదు, పూర్తిగా వెల్లకిలా పడుకుని విశ్రాంతి తీసుకోవటం. మీరు ఖచ్చితంగా లేదనే అంటారు. అదేలా సాధ్యమని కూడా మీరు సందేహం వ్యక్తం చేస్తారు. కానీ, ఇక్కడో వ్యక్తి మాత్రం ద్విచక్ర వాహనంపై ఎలా విశ్రాంతి తీసుకుంటున్నాడో చూస్తే షాక్‌ అవుతారు. అది కూడా రద్దీగా ఉన్న ట్రాఫిక్ మధ్యలో బైక్‌పై హాయిగా పడుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో భారీగా ట్రాఫిక్‌ను చూడవచ్చు. ట్రాఫిక్ మధ్యలో ఓ వ్యక్తి స్కూటీపై పడుకుని కనిపించాడు. ఆ వ్యక్తి తన రెండు పాదాలను స్కూటీ హ్యాండిల్‌పై ఉంచాడు. అతను మొత్తం సీటుపై హాయిగా పడుకున్నాడు. గ్రీన్‌ సిగ్నల్ పడిన వెంటనే, ఆ వ్యక్తి ఆనందంతో లేచి నిటారుగా కూర్చుంటాడు.

ఇవి కూడా చదవండి

భారీ ట్రాఫిక్‌ జామ్‌ మధ్యలో స్కూటీపై విశ్రాంతి తీసుకుంటున్న వ్యక్తిని చూసి అందరూ నవ్వుకుంటున్నారు . సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోని బాగా ఇష్టపడి రకరకాలుగా రియాక్షన్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేయబడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోకు ఫన్నీగా క్యాప్షన్ కూడా ఇచ్చారు.

View this post on Instagram

A post shared by Memes | YooBros (@yoo__bros)

ఈ వీడియోపై జనాలు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు – ‘వావ్ వాట్ ఎ సీన్.’ అంటూ కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..