Assam: రుతుపవనాల ప్రారంభంతోనే కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అక్కడ బీభత్సం సృష్టించాయి. కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఓ ఇంట్లో ఉన్న నలుగురు కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన ..

Assam: రుతుపవనాల ప్రారంభంతోనే కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి
Landslide
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 14, 2022 | 11:46 AM

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అక్కడ బీభత్సం సృష్టించాయి. కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఓ ఇంట్లో ఉన్న నలుగురు కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన అస్సాంలోని గౌహతి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..అసోంలో రుతుపవనాల ప్రారంభంతోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. గువాహటి నగరంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.

పశ్చిమ బోరా బోరాలోని నిజర్రాపర్‌లో రాత్రి కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలిపోయింది. ఇంట్లో నిద్రపోతున్న నలుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకుని చనిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులతో కలిసి వారి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు గౌహతి వెస్ట్ డీసీపీ నబనీత్ మహంత తెలిపారు. భారీ వర్షాల కారణంగా అస్సాంలోని పలు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి..భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఆపరేషన్‌ చేపట్టారు. జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..