Mamata Banerjee: కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెడుతున్న మమతా బెనర్జీ మంత్రాంగం.. రాష్ట్రపతి ఎన్నికలో గెలుపు ఎవరిది..?
Presidential Elections: రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగిన క్రమంలో దేశంలో రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. అధికార NDA పక్షాన్ని నిలువరించాలన్న టార్గెట్‌తో బలమైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు పలు విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి.

సమయం లేదు మిత్రమా.. ఇక రణంలోకి దూకుదాం.. ఇప్పుడు కాకుంటే ఎప్పటికీ కాదు.. కలిసికట్టుగా కమలానికి కమిలిపోయేలా రిటర్న్ గిప్ట్ పంపుదాం..అదిప్పుడే జరగాలా…రాబోయే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ నుంచే ముందడుగు పడాలా. బీజీపీయేతర శక్తుల్లారా.. మాతో కలిసి వచ్చేదెవరు.. మాతో గెలిచి నిలిచేదెవరు.. బీజేపీని పడగొట్టేందుకు చేయి కలిపేదెవరు.. అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పంపిన సందేశం పొలిటికల్ విలేజ్‌లో హాట్‌కేకులా రచ్చ చేస్తోంది. భారతదేశ అగ్ర ప్రతిపక్ష నాయకురాలిగా ఎదగాలనే తృష్ణ ఆమెను గుదిబండలా మార్చేస్తోంది. జాతీయ రాజకీయాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జోరు పెంచారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శల దాడి మొదలు పెట్టారు. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని విపక్ష పార్టీల అధ్యక్షులు, సీఎంలకు మమతా లేఖ రాశారు. దేశవ్యాప్తంగా 22 మంది ప్రతిపక్ష నేతలు, బీజేపీ, కాంగ్రెస్ యేతర ముఖ్యమంత్రులకు లేఖ పంపించారు. మహారాష్ట్ర , కేరళ , తెలంగాణ , జార్ఖండ్ , పంజాబ్ , తమిళనాడు ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మమత లేఖ రాశారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ పేరు ప్రముఖంగా విన్పించింది. అయితే బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉందని, తాను ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల లాభం ఉండదని క్లారిటీ ఇచ్చారు పవార్. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ప్రగతి శీల శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి ఎవరన్నవిషయంపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ లోని కాన్ట్సిట్యూషన్ క్లబ్‌లో జూన్ 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని తృణమూల్ కాంగ్రెస్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి దింపేందుకు రెడీ అవుతోంది. ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కోవిడ్‌తో బాధపడుతున్నందున.. ఇదే అంశంపై ఇతర ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరపడానికి రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గేకు బాధ్యతలను అప్పగించారు. మరో కీలక సందేశం కూడా పంపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తమ నేతల్లో ఒకరిని నామినేట్ చేయాలని పట్టుబట్టబోదని బీజేపీయేతర పక్షాలకు తెలిపారు. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ జూన్ 15 న ఈ అంశంపై చర్చకు మరికొన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులను కూడా ఆహ్వానించింది. అయితే అదే రోజున మమతా బెనర్జీ కూడా విడిగా సమావేశం ఏర్పాటు చేయడంతో గందరగోళంగా మారింది.
అయితే మమతా బెనర్జీ మాత్రం జాతీయ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. 2024 జరుగనున్న లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉండాలని అంచనా వేస్తున్నారు. గత కొంత కాలం జాతీయ రాజకీయాల్లోకి అడుగులు వేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో బాగంగానే దేశంలోని విపక్ష నేతలు, ముఖ్యమంత్రులకు లేఖ రాశారు బంగాల్ సీఎం మమతా బెనర్జీ. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నందున నలుగురు ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశానికి హాజరవుతారా..? అనే సందేహాలు ఉన్నాయి.




అలాగే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. అతని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారా..? లేదా కేజ్రీవాల్ స్వయంగా ప్రధానమంత్రి పదవిపై దృష్టి సారించినందున ఇది సందేహమే. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా సమావేశాన్ని దాటవేయవచ్చు, ఎందుకంటే శివసేన మరియు డిఎంకె మాదిరిగానే అతని పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) కూడా కాంగ్రెస్ మిత్రపక్షం. మరోవైపు బెనర్జీ ఆహ్వానాన్ని ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), భూపేష్ బాఘేల్ (ఛత్తీస్‌గఢ్) అంగీకరించే ప్రశ్నే లేదు. బెనర్జీకి కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు(CM KCR) మాత్రమే మిగిలి ఉన్నారు. బెనర్జీ, కేజ్రీవాల్ వంటి వారు 2024 ఎన్నికలలో ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీని సవాలు చేయాలని చూస్తున్నారు.
గత ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్.. వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకుంది. అదే జోష్‌తో 2024 ఎన్నికల్లోనూ మోడీని జాతీయ స్థాయిలో ఢీ కొడుతానంటూ మమతా బెనర్జీ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేకుండా ప్రతిపక్ష ఐక్యత సాధ్యం కాదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ వంటివారు ఆమెను సూచించినప్పటికీ.. మమతా తన దారిలో వెళుతోంది.
రాష్ట్రపతి ఎన్నికలకు సంయుక్త వ్యూహాన్ని రూపొందించేందుకు జూన్ 15న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ముఖ్య నేతలను కోరారు. ఈ సమావేశానికి ఎవరు వస్తారు? ఎవరు డుమ్మా కొడుతారు? కీలక ప్రాంతీయ పార్టీల నేతలు పాల్గొంటారా? అన్నదానిపై ఆశక్తికరమైన చర్చ సాగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సమావేశానికి వెళ్తారా? వెళ్తే ఎలాంటి సందేశం ఇస్తారన్నది కూడా హాట్ టాపిక్‌గా మారుతోంది.
జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. 21న ఓట్ల లెక్కింపు చేపట్టనన్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చేనెల 24వ తేదీతో ముగియనుంది. రాష్ట్రపతి రేసులో పలువురు శరద్ పవార్, నితీశ్ కుమార్, ద్రౌపది ముర్ము, ఆరిఫ్ మహ్మద్ ఖాన్, తమిళిసై సౌందరరాజన్, జగదీశ్ ముఖి వంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు టీఎంసీ ప్రయత్నాలు..
దేశ వ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు అతి పెద్ద ప్లాన్‌తో అడుగులు వేస్తోంది టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసనసభ్యులను టిఎంసి తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. మరో అడుగు ముందుకువేసిన టీఎంసీ అవసమైతే తన పార్టీలోకి చేర్చుకుంటోంది. ఆమె కాంగ్రెస్ పార్టీని విభజించి.. పశ్చిమ తీర రాష్ట్రమైన గోవాలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావించి తన పార్టీలో దాని నాయకులు, కార్యకర్తలను చేర్చుకుంది. గత ఏడాది గోవాలో జరిగిన ఎన్నికల్లో చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఎంసీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ విజయానికి గండికొట్టింది టీఎంసీ.
గోవాలో మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ క్రమంలో 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ 17 సీట్లు గెలుచుకొంది. బీజేపీ 13 సీట్లే గెలుచుకొన్నప్పటికీ.. ప్రాంతాయ పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉన్న టీఎంసీ చేసీ చేసిన ప్రచారంతో కాంగ్రెస్ పార్టీకి విజయం ఎండమావిగా మారింది.
అయితే గత ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన కాంగ్రెస్ ఈ సారి మంచి ఫలితాలను ఆశిస్తోంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ ప్రవేశం ఆ పార్టీ ఓటు బ్యాంక్‌ను దెబ్బతీసింది. కాంగ్రెస్ ఓట్లను చీల్చి బీజేపీని లబ్ధి చేకూర్చిందని స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గోవాలో తృణమూల్ సభ్యుల కంటే ప్రశాంత్ కిశోర్ సభ్యు లే ఎక్కు వగా ఉన్నారని కాంగ్రెస్ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం ఆప్ వల్లసాధ్యం కాదన్న ఉద్దేశంతోనే తృణమూల్‌ను బీజేపీ రంగంలోకి దిపిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీని విస్మరించడం ప్రతిపక్షాలను విభజించడమే అవుతుందని బెనర్జీ గుణపాఠం నేర్చుకోలేదు. ప్రతిపక్షాలు ఏకం కాకపోతే ప్రధాని కావాలనే ఆమె కల కలగానే మిగిలిపోతుంది. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు సోనియా గాంధీ ఆమెతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.
దీదీ సెకెండ్ గేమ్..
మమతా బెనర్జీ వద్ద రెండవ సారి ఫిడిల్ ప్లే చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఏది ఏమైనప్పటికీ, రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 29 చివరి తేదీ.. వివిధ స్థాయిలలో అనధికారిక సంప్రదింపులు జరుగుతున్నందున ఆమె తొందరపాటు వర్ణించలేనిది. 2024లో మోడీని సవాలు చేయడానికి మమతా బెనర్జీ బుధవారం సమావేశం, వాయిదా వేయకపోతే.. అది ఒక ఫ్లాప్ షోగా ముగుస్తుంది. ఆమె జాతీయ ఆశయాలకు మరింత హాని కలిగించవచ్చు. ఇందుకు బదులుగా 2024లో మోడీని సవాలు చేయడానికి ఉత్తమ ప్రతిపక్ష అభ్యర్థిగా ఆమె క్రెడెన్షియల్‌గా మారేందుకు సహాయపడవచ్చు.




