Uric Acid: టీ వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుందా? యూరిక్ యాసిడ్ రోగులకు ఏ చాయ్ మంచిది..

పెరిగిన యూరిక్ యాసిడ్ గౌట్, కిడ్నీ వ్యాధిగా మారుతుంది. ప్రమాదాన్ని పెంచుతుంది. యూరిక్ యాసిడ్ అటువంటి సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.

Uric Acid: టీ వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుందా? యూరిక్ యాసిడ్ రోగులకు ఏ చాయ్ మంచిది..
Tea Side Effects
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 13, 2022 | 10:00 PM

ప్యూరిన్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ అనేది ప్రతి ఒక్కరి శరీరంలో తయారయ్యే టాక్సిన్, మూత్రపిండాలు దానిని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా శరీరం నుంచి తొలగిస్తాయి. యూరిక్ యాసిడ్ ఏర్పడటం సమస్య కాదు.. కానీ శరీరంలో దాని పెరుగుదల సమస్య. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణంగా మారుతుంది. ఆహారంలో మాంసం, బీర్, బీన్స్ అధికంగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరగడాన్ని వైద్య భాషలో హైపర్యూరిసెమియా అంటారు.

యూరిక్ యాసిడ్ ఉన్న రోగులు ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. లేకుంటే యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. పెరిగిన యూరిక్ యాసిడ్ గౌట్, కిడ్నీ వ్యాధిగా మారుతుంది. ప్రమాదాన్ని పెంచుతుంది. యూరిక్ యాసిడ్ అటువంటి సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.

జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. యూరిక్ యాసిడ్ రోగులకు టీ వినియోగం వారి సమస్యను పెంచుతుంది. యూరిక్ యాసిడ్ పేషెంట్లు ఎలాంటి టీని తీసుకోవాలో తెలుసుకుందాం, తద్వారా యూరిక్ యాసిడ్ పెరిగే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

తక్కువ పాల టీని తీసుకోండి: మిల్క్ టీ యూరిక్ యాసిడ్ రోగులకు హాని కలిగిస్తుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు పాల కలిపిన టీని తీసుకోకూడదు. పాలలో చాలా కొవ్వు ఉంటుంది. దీని కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తం పెరుగుతుంది.

టీతో అధిక చక్కెరను తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. యూరిక్ యాసిడ్ ఉన్న రోగులకు టీ తీసుకోవడం వల్ల గౌట్ సమస్య పెరుగుతుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. టీ తీసుకోవడం వల్ల నిర్జలీకరణం(అసాధారణమైన లేదా హానికరమైన స్థాయిలో మన శరీరం నుండి నీరు కోల్పోవడాన్ని “నిర్జలీకరణం” (dehydration) అంటారు) పెరుగుతుంది. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగించడం మూత్రపిండాలకు కష్టతరం చేస్తుంది.

గ్రీన్ టీ తీసుకోండి: యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు అలాంటి వారు మిల్క్ టీకి బదులుగా గ్రీన్ టీని తీసుకోవాలి. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి.. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో సమృద్ధిగా ఉన్న గ్రీన్ టీ యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

టీకి బదులు కాఫీని తాగండి: యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు, అలాంటివారు టీకి బదులు కాఫీని తీసుకోవాలి. కాఫీ యూరిక్ యాసిడ్‌గా ప్యూరిన్‌ల(యూరిక్ యాసిడ్ ను కంట్రోల్ చేసే ఫుడ్స్ ) విచ్ఛిన్నతను నెమ్మదిస్తుంది. విసర్జన రేటును వేగవంతం చేస్తుంది. టీకి బదులుగా కాఫీ తీసుకోవడం యూరిక్ యాసిడ్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.